WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సిబ్బంది తమ పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం ఎదురుచూస్తున్నారు. మూడేళ్లుగా ప్రయాణ భత్యం (TA), సరెండర్ లీవ్ అలవెన్సులు విడుదల కాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని సిబ్బంది వాపోతున్నారు. కమిషనరేట్ పరిధిలో సుమారు 3 వేల మందికి పైగా సిబ్బందికి రూ. 30 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం.