చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే చేపలతో పాటు పెరుగు కలిపి తినడం ఆరోగ్యానికి ప్రమాదమని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. చేపల్లో ఉండే ప్రోటీన్, పెరుగులోని కాల్షియం.. ఈ రెండింటిని కలిపి తినడం వల్ల జీర్ణవ్యవస్థపై అధిక భారం పడుతుంది. జీర్ణ సమస్యలతో పాటు అలెర్జీలు వచ్చే అవకాశం ఉంది. దీంతో బరువు కూడా అధికంగా పెరిగే ఛాన్స్ ఉంది.