E.G: నల్లజర్లలోని కింగ్స్ వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఆదివారం నిర్వహించిన ఏపీ ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్-2026 కార్యక్రమానికి గోపాలపురం MLA మద్దిపాటి వెంకటరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ కనబరచాలని సూచించారు. చదువు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా సృజనాత్మకతను పెంపొందించే విధంగా ఉండాలన్నారు.