TPT: తిరుపతి పరిసర ప్రాంతాల్లో రవాణా శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో పన్నులు చెల్లించకుండా నడుస్తున్న రెండు టూరిస్ట్ బస్సులను గుర్తించారు. నాగాలాండ్ రిజిస్ట్రేషన్ బస్సుకు రూ. 3.60 లక్షలు, తెలంగాణ బస్సుకు రూ.70 వేల జరిమానా విధించారు. జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీ మోహన్ పన్నులు చెల్లించని వాహనాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు.