RRతో మ్యాచ్‌లో RCB వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ సాల్ట్ పెవిలియన్ చేరాడు. పడిక్కల్(14).. ఆర్చర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి హెట్మెయర్ పట్టిన సూపర్ క్యాచ్‌తో వెనుదిరిగాడు. ఇక దూకుడుగా ఆడుతున్న కోహ్లీని (32) రవి బిష్ణోయి LBWగా ఔట్ చేశాడు. దీంతో 4.5 ఓవర్లలో 58 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది.