తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు జిల్లాల్లో వడగళ్ల వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తెలంగాణలో నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఏపీలో అల్లూరి జిల్లాలో కుంభవృష్టి వర్షం పడింది. అసలైన ముప్పు మార్చి 18 నుంచి 20 వరకు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.