W.G: వైసీపీ నేత, శాసనమండలి ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణను ఆదివారం వైసీపీ ప.గో జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు హైదరాబాద్లో కలిశారు. ఇటీవల అనారోగ్యం బారిన పడి తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న బొత్స యోగక్షేమాలను ప్రసాద రాజు అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.