కృష్ణా: గుడివాడ టిడ్కో కాలనీలో ఎస్సై చంటిబాబు ఆటో డ్రైవర్లకు ఆదివారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరాన్ని వివరించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వేగ పరిమితులను పాటించడం, మద్యం సేవించి వాహనం నడపకూడదని, సరైన డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు.