AKP: జిల్లాలో ఆదివారం నిర్వహించిన అక్షరాంధ్ర పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. అనకాపల్లి జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. జిల్లాలో 2,478 పరీక్షా కేంద్రాల్లో 93, 292 మంది అభ్యాసకులు పరీక్ష రాసినట్లు పేర్కొన్నారు.