జనగామ పట్టణంలో పర్యటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల్లో ఒక్కటీ నెరవేర్చలేదని, రాష్ట్రంలో ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందని ఆరోపించారు. కేరళలో ప్రచారం చేస్తూ తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలు చేయకుండ అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదమన్నారు.