VKB: గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులకు ఆదేశించారు. బుధవారం కోట్పల్లి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. వైద్యులు సమయానికి అందుబాటులో ఉంటూ ప్రజలకు వైద్య సేవలు అందించాలని చెప్పారు.