SRPT: ప్రొఫెసర్ జయశంకర్ ‘బడి బాట’ కార్యక్రమంలో భాగంగా మఠంపల్లి మండలం మంచ్యతండ ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని గ్రామ సర్పంచ్ భద్రమ్మ తెలిపారు. తల్లిదండ్రులందరూ తమ పిల్లలను బడిలో చేర్పించి ప్రభుత్వం అందించే ఉచిత పుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజన సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చదువు మానేసిన పిల్లలను మళ్ళీ బడికి పంపలన్నారు.