KNR: సైదాపూర్ మండలం దుద్దెనపల్లిలోని అంగన్వాడీ కేంద్రంలో గురువారం గర్భిణీలకు, బాలింతలకు సర్పంచ్ ఉడిగే విజయ పౌష్టికహారం పంపిణీ చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు, బాలింతలు, గర్భిణీలకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త, తదితరులు ఉన్నారు.