ADB: గత పది సంవత్సరాల BRS పాలనలోనే పట్టణ అభివృద్ధి జరిగిందని BRS పార్టీ, మునిసిపల్ ఫ్లోర్ లీడర్ ప్రకాష్ అన్నారు. గురువారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పట్టణ అభివృద్ధి జరిగిందని చెప్పటం సిగ్గుచేటని పేర్కొన్నారు. మాజీ మంత్రి జోగు రామన్న గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదని అన్నారు.