ఎముకలు, దంతాల ఆరోగ్యానికి క్యాల్షియం ఎంతో అవసరం. పాలు, పెరుగు, పనీర్ వంటి డైరీ ఉత్పత్తులే కాకుండా.. రాగులు, సజ్జలు, నువ్వుల్లో ఇది పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా పాలకు మించిన క్యాల్షియం రాగుల్లో లభిస్తుంది. మునగాకు, పాలకూర వంటి ఆకుకూరలు, బాదం, అంజీర్, సోయాబీన్స్, శనగల్లో కూడా క్యాల్షియం అధికంగానే ఉంటుంది. ఎముకల బలహీనతను అడ్డుకోవడానికి వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.