MDK: పిల్లలకు ఒంటిపూట బడులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈతకు వెళ్లే పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా వారిపై నిఘా ఉంచాలని మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లల ఈత సరదా ప్రమాదంగా మారే అవకాశం ఉందన్నారు. పిల్లలకు నీటి లోతు తెలియకపోవడం వల్ల జారి నీటిలో పడిపోయే ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.