MDK: రాంపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సాయాగౌడ్ కుటుంబానికి ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు అండగా నిలిచారు. ఆదివారం బి. భూపతిపూర్ గ్రామానికి వెళ్లిన ఆయన, సాయాగౌడ్ భౌతికకాయానికి నివాళులర్పించారు. మృతుడి కుమారుడు, కుమార్తె పేరిట తలా రూ. 25 వేల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.