CTR: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి కృష్ణమూర్తి అని విశ్రాంత DSP సుకుమార్ బాబు పేర్కొన్నారు. పుంగనూరు నియోజకవర్గ బీసీ సంఘం అధ్యక్షుడు కృష్ణమూర్తి ఇటీవల గుండెపోటుతో చెందారు. ఈ మేరకు ప్రజా సంఘాల నాయకులు ఆదివారం పట్టణంలోని స్థానిక ఇందిరా కూడలిలో సంతాప సభ ఏర్పాటు చేశారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.