KMR: బిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామ పంచాయతీ తైబజార్ వేలంపాట సోమవారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు కార్యదర్శి దయాకర్ రెడ్డి తెలిపారు. ఏడాది పాటు పన్ను వసూలు చేసుకునే హక్కు కోసం జరిగే ఈ వేలంలో పాల్గొనేవారు ముందుగా పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. గ్రామ సచివాలయం వద్ద జరిగే ఈ వేలంపాటకు ఆసక్తి గల గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఆయన కోరారు.