SKLM: జలుమూరు మండలం తిలారు రైల్వే స్టేషన్లో తత్కాల్ టికెట్ల సౌకర్యం ఏర్పాటు చేయాలని పలు ప్రాంత ప్రయాణికులు కోరుతున్నారు. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు ఈ సౌకర్యం లేక సుదూర ప్రాంతాలకు వెళ్లి టిక్కెట్లు తీయడానికి నానా అవస్థలు పడుతున్నట్లు తెలిపారు. సంబంధిత అధికారులు పరిశీలించి తత్కాల్ ఏర్పాటు చేయాలని కోరారు.