సత్యసాయి: నల్లమాడ మండలం బాపనకుంట గ్రామంలో ఆదివారం ఎస్సై సతీష్ కుమార్ డ్రోన్ కెమెరాతో అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా నిర్వహించారు. మట్కా, జూదం, ఓపెన్ డ్రింకింగ్, కోడి పందేలు వంటి కార్యకలాపాలను అరికట్టేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గ్రామాల్లో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.