వనపర్తి మండలం ఏదుట్ల గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ సునీత రాజవర్ధనరెడ్డి పాటు గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు హాజరయ్యారు. లబ్ధిదారుడి కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే, ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిరుపేదల జీవితాల్లో మార్పు తెస్తున్నాయని అన్నారు.