గద్వాల్ జిల్లా కేంద్రంలోని ఈద్గా సమీప శ్మశాన వాటికలో చేతి పంపు చెడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంత్యక్రియల అనంతరం ముఖాలు శుభ్రం చేసుకుందామన్నా నీరు రాకపోవడంతో అవస్థలు తప్పడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ఈద్గా కమిటీ సభ్యులు వెంటనే స్పందించి బోరింగ్కు మరమ్మతులు చేయించాలని వారు కోరుతున్నారు.