కోనసీమ: రహదారి ప్రమాదాల నివారణకు జిల్లా పోలీస్ యంత్రాంగం వినూత్న చర్యలు చేపట్టింది. SP ఆదేశాలతో అమలాపురంలోని జాతీయ, రాష్ట్ర రహదారులపై అర్ధరాత్రి, సోమవారం తెల్లవారుజామున వాహనాలను నిలిపి డ్రైవర్లతో ముఖం కడిగిస్తున్నారు. వారితో కాసేపు మాట్లాడి.. నిద్రమత్తు వల్ల కలిగే ముప్పును వివరిస్తూ లారీలు, బస్సులు, కార్ల డ్రైవర్లను పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు.