AKP: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కసింకోటలో నిర్వహిస్తున్న చిల్డ్రన్ హోమ్‌ను కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదివారం తనిఖీ చేశారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. మెనూ ప్రకారం ఆహారం ఇవ్వాలని ఆదేశించారు. వారికి అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు. సమస్యలు ఉంటే తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు. కలెక్టర్ వెంట డీఈవో అప్పారావు ఉన్నారు.