మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా విడుదల వాయిదా పడింది. ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా జూన్‌కు వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా మేకర్స్ ఒక ప్రత్యేక పోస్ట్‌ను షేర్ చేశారు.
మలయాళ చిత్ర పరిశ్రమలో ‘వాలా 2’ సంచలనం సృష్టిస్తోంది. 13 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.176.05 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దీంతో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రాల జాబితాలో టాప్-6లోకి చేరింది. పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘ది గోట్ లైఫ్’ (రూ.158.50 కోట్లు) కలెక్షన్లను ఈ సినిమా కేవలం 10 రోజుల్లోనే దాటేయడం విశేషం.
మలయాళ సెన్సేషన్ ‘వాలా’ సిరీస్ నుంచి 3వ భాగం సిద్ధమవుతోంది. ‘బయోపిక్ ఆఫ్ బిలియన్ గర్ల్స్’ ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను విపిన్ దాస్ విడుదల చేశాడు. గత భాగాల్లో అబ్బాయిల కథలను చూపగా, ఈసారి పూర్తిగా మహిళా ప్రధాన తారాగణంతో రావడం విశేషం. విపిన్ దాస్ కథను అందించగా, విశ్వన్ శ్రీజిత్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
విజయ్ దేవరకొండ, దర్శకుడు రవికిరణ్ కోలా కాంబోలో వస్తున్న ‘రౌడీ జనార్ధన’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్ర మూడవ షెడ్యూల్ ఏప్రిల్ 16 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో విజయ్‌తో పాటు కీర్తి సురేష్ కూడా పాల్గొననున్నట్లు టాక్. ఈ నెల చివరి వరకు HYD పాతబస్తీ పరిసరాల్లోని పలు లొకేషన్లలో కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు మేకర్స్ ప్లాన్ చేశారట.
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘నాగబంధం’. 2026 జూలై 3న ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ OTT డీల్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. దీని డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 27కోట్లకు ప్రైమ్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇక సినిమాలో నభా నటేష్, ఐశ్వర్యా మేనన్, జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు.
మలయాళ స్టార్ టొవినో థామస్ నటించిన భారీ పీరియాడిక్ మూవీ ‘పళ్లి చట్టంబి’. ‘జన గణ మన’ ఫేమ్ డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1950-60ల నాటి నేపథ్యంలో సాగుతుంది. ఏప్రిల్ 15న మలయాళంలో విడుదలైన ఈ సినిమాను, ఏప్రిల్ 17న ప్రముఖ నిర్మాత బన్ని వాస్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాడు. పక్కా యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
‘బాహుబలి’ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న యానిమేషన్ మూవీ ‘బాహుబలి: ద ఎటర్నల్ వార్’. ప్రతిష్టాత్మక ఎన్నెసీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైంది. దీనిపై దర్శకుడు రాజమౌళి స్పందిస్తూ.. యానిమేషన్ ప్రపంచానికి హద్దులు లేవని తాను నమ్ముతున్నానని, ఈ ఎంపిక భారతీయ సినిమాకు దక్కిన గౌరవమని తెలిపాడు. ప్రపంచ ప్రసిద్ధ వేదికపై మన కథను ప్రదర్శించే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నాడు.
సల్మాన్ ఖాన్ హీరోగా వస్తున్న ‘మాతృభూమి’ సినిమా విడుదలపై సందిగ్ధత నెలకొంది. ఏప్రిల్‌లో రావాల్సిన ఈ చిత్రం, ఇప్పటికీ సెన్సార్ బోర్డు ముందుకు వెళ్లలేదట. రక్షణ మంత్రిత్వ శాఖ సూచనల మేరకు దర్శకుడు కథలో భారీ మార్పులు చేసి, సుమారు 40% రీషూట్ చేసినట్లు సమాచారం. అదనపు రొమాంటిక్ సీన్లు, కొత్త బ్యాక్‌స్టోరీల వల్ల జాప్యం జరుగుతుండటంతో, ఇది మేలో కూడా విడుదలవ్వడం కష్టమేనని టాక్.
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో 2018లో వచ్చిన హిట్ మూవీ ‘ఈ నగరానికి ఏమైంది’కి సీక్వెల్‌గా ‘ENE రిపీట్’ రాబోతుంది. ఈ మూవీ కొత్త షెడ్యూల్ ఇవాళ థాయ్‌లాండ్‌లో ప్రారంభమైంది. మే 20 వరకు అక్కడే చిత్రీకరణ జరగనుంది. ఈ షెడ్యూల్‌తో దాదాపు 80% షూటింగ్ పూర్తవుతుంది. ఇక చిత్ర బృందం ఈ సినిమాను అక్టోబర్ 15న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది.
కన్నడ స్టార్ యష్ నటిస్తున్న తాజా సినిమా ‘టాక్సిక్’. ఈ మూవీ గురించి ఆయన ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇది గ్యాంగ్‌స్టర్ సినిమా కాదని, ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసే విభిన్న కథాంశమని చెప్పాడు. బలమైన భావోద్వేగాలు, అద్భుతమైన విజువల్స్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం ఇంగ్లీష్‌లో కూడా విడుదల కానుంది. ఈ మూవీ 2026 జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నిహారికలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్టాండప్ కమెడియన్ అనుదీప్‌ను కాకినాడ పోలీసులు అరెస్ట్ చేశారు. జనసేన నేత బడే వెంకట కృష్ణ ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న అనుదీప్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ప్రస్తుతం కాకినాడకు తరలిస్తున్నారు. విచారణ అనంతరం తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నారు.
వాల్ట్ డిస్నీ కొత్త సీఈఓ జోష్ డి అమారో బాధ్యతలు చేపట్టిన నెలలోనే 1,000 మంది ఉద్యోగుల తొలగింపునకు నిర్ణయించారు. మార్కెటింగ్, స్టూడియోలు, ESPN, టెక్నాలజీ విభాగాల్లో ఈ కోతలు ఉండనున్నాయి. అసద్ అయ్యాజ్ నేతృత్వంలోని ‘యూనిఫైడ్ మార్కెటింగ్ స్ట్రక్చర్’ ద్వారా పనితీరును మెరుగుపరిచేందుకు ఈ మార్పులు చేస్తున్నారు. ఖర్చుల తగ్గింపు, సామర్థ్యం పెంపు లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబోలో తెరకెక్కిన ‘ధురంధర్’ ఫ్రాంఛైజీ ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సిరీస్ రెండు భాగాలతోనే ప్రపంచవ్యాప్తంగా రూ.3000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన మొదటి ఇండియన్ ఫిల్మ్ ఫ్రాంఛైజీగా నిలిచింది. ఇక ప్రపంచవ్యాప్తంగా మొదటి భాగం రూ.1300CR+, రెండో భాగం రూ.1700CR+ వసూళ్లు చేశాయి.
బాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’కు జపాన్ మూవీ ‘గాడ్జిల్లా మైనస్ జీరో’ రూపంలో భారీ ముప్పు పొంచి ఉంది. రెండు సినిమాలు ఐమ్యాక్స్ వెర్షన్‌లో 2026 నవంబరులో వస్తుండటంతో స్క్రీన్స్ కేటాయింపులో క్లాష్ రానుంది. ఆస్కార్ విన్నింగ్ సీక్వెల్ కావడంతో విదేశాల్లో గాడ్జిల్లాకు క్రేజ్ ఎక్కువ. దీంతో రూ.4000 కోట్ల బడ్జెట్ ‘రామాయణ’ ఓవర్సీస్ కలెక్షన్లపై ఈ ప్రభావం పడే అవ...
రణ్‌బీర్ సింగ్ రాముడిగా యష్ రావణుడిగా రాబోతున్న సినిమా ‘రామాయణ’. ఈ మూవీలో ఇప్పటివరకు రణబీర్‌కు, తనకు మధ్య ఎలాంటి కాంబో సీన్స్ చిత్రీకరించలేదని యష్ తెలిపాడు. మొదటి భాగంలో రాజ్యాల నేపథ్యం వేర్వేరుగా ఉంటుందని, అందుకే తమ మధ్య స్క్రీన్ షేర్ చేసుకునే సన్నివేశాలు రాలేదని చెప్పాడు. అయితే, సెట్స్‌లో కలిసినప్పుడు మాత్రం తమ మధ్య బాండింగ్ చాలా బాగుంటుందని అన్నాడు.