కృష్ణా జిల్లా మోపిదేవిలో శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని హీరో శర్వానంద్ దర్శించుకున్నాడు. కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించాడు. నాగపుట్టలో పాలుపోసి గర్భాలయంలో పూజలు చేశాడు. అనంతరం అర్చకులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ప్రధాని నరేంద్ర మోదీని హీరో విజయ్ దేవరకొండ కలిశాడు. ఢిల్లీలో జరిగిన ఓ సమ్మిట్‌లో ప్రధాని హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ కూడా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మై హోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు, హీరోయిన్ యామి గౌతమ్, బ్యాట్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ కలిసి ప్రధానితో ఫొటో దిగారు.
విజయాలు సాధించడమే సక్సెస్ కాదని, నచ్చిన విధంగా జీవించడమే అని నటి సమంత చెప్పింది. ‘సక్సెస్ అంటే.. నిజ జీవితంలో ఎన్నో రకాల పాత్రలను పోషిస్తూ అన్నింటిలోనూ సమర్థవంతంగా రాణించగలగడం. అలాగే మన ఇష్టాయిష్టాలకు తగ్గట్లుగా పనిచేయడం. అంతేకానీ మహిళలను ఒకచోట బంధించి ఇది చేయాలి? ఇది చేయకూడదు అని చెప్పడం కాదు’ అని పేర్కొంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబోలో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీ పునర్జన్మ కాన్సెప్ట్‌తో ముడిపడి ఉన్న భారీ పీరియాడిక్ డ్రామాతో తెరకెక్కనున్నట్లు సమాచారం. దీనికి తగ్గట్టుగా బన్నీ 2 భిన్న గెటప్ల్లో కనిపించనున్నాడట. ఈ మూవీలో విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యత ఉండనున్నట్లు, జూలై లేదా ఆగస్టులో షూటింగ్ మొదలుకానున్నట్లు సినీ వర్గాల్లో టాక్.
దర్శకుడు మెహర్ రమేశ్ సోదరి సత్యవతి మృతిపై మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. సత్యవతి స్వర్గస్థులవటం ఎంతగానో కలచి వేసిందని అన్నారు. ఆమె తనకూ సోదరేనని.. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు. తన సోదరి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు.
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ‘సోదరా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఏప్రిల్ 11న ఇది విడుదల కాబోతుంది. ఇక అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో సంజోష్ కీలక పాత్ర పోషించగా.. మన్మోహన్ మేనంపల్లి దర్శకత్వం వహించాడు.
శబరిమలలో మమ్ముట్టి పేరిట మోహన్‌లాల్ ప్రత్యేక పూజలు చేయించడం వివాదానికి దారి తీసింది. తాజాగా ఈ అంశంపై మోహన్‌లాల్ స్పందించారు. ‘అందులో తప్పేముంది?. అతను నా ఫ్రెండ్ కాబట్టి ప్రత్యేక పూజ చేయించాను. అది నా వ్యక్తిగత విషయం’ అని ఓ ప్రెస్ మీట్లో స్పష్టం చేశారు.
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘రాబిన్‌హుడ్’ లాంటి ఫన్ ఉన్న సినిమాని తన కెరీర్లో ఇప్పటివరకూ చేయలేదని తెలిపింది. ‘ఈ మూవీలో నేను విదేశాల నుంచి ఇండియా వచ్చిన అమ్మాయిగా కనిపిస్తా. క్యారెక్టరైజేషన్ చాలా క్యూట్‌గా ఉంటుంది. నిజానికి ఈ పాత్రను రష్మిక చేయాలి. అయితే, డేట్స్ కుదరకపోవడం వల్ల చేయలేదు’ అని చెప్పుకొచ్చింది.
హీరో నాని సమర్పణలో రామ్ జగదీష్ తెరకెక్కించిన మూవీ ‘కోర్ట్’. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని వసూళ్లు రాబడుతోంది. 10 రోజుల్లో ఈ మూవీ రూ.50 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఇదొక హిస్టారిక్ జడ్జిమెంట్ అంటూ ప్రకటించింది. ఇక ఈ సినిమాలో ప్రియదర్శి, శివాజీ, హర్ష్ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రలు పోషించారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో ‘RC-16’ మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ఫిక్స్ అయినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి ‘పెద్ది’ అని టైటిల్ పెట్టినట్లు పలు పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథనాయికగా నటిస్తుండగా.. AR రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
నితిన్ హీరోగా వేణు యెల్దండి తెరకెక్కిస్తున్న మూవీ ‘ఎల్లమ్మ’. ‘బలగం’ వంటి సూపర్ హిట్ తర్వాత దర్శకుడు వేణు నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘ఎల్లమ్మ’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో హీరోయిన్గా సాయిపల్లవి నటిస్తుందని ప్రచారం జరిగింది. కానీ ఆమె స్థానంలో చిత్ర యూనిట్ కీర్తి సురేష్‌ను సంప్రదించగా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది.
అలనాటి ప్రముఖ నటుడు కత్తి కాంతారావు వర్ధంతి ఇవాళ. ఆయన సూర్యపేట జిల్లా కోదాడ మండలం గుడిబండలో నవంబర్ 16, 1923లో జన్మించారు. కత్తి కాంతారావు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 400 పైగా సినిమాలలో నటించారు. పౌరాణిక, జానపద చిత్రాలలో కూడా నటించి జానపద నటుడిగానూ పేరుగాంచారు. తెలుగు తెరపై కత్తిసాముతో ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టేలా అనేక జానపద చిత్రాలలో నటించిన నట ప్రపూర్ణుడు.
నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తోన్న సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. వేసవిలో ఇది రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను గెస్ట్‌గా తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. HYDలో ఈ ఈవెంట్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఇక తారక్.. కళ్యాణ్ రామ్ పలు సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వచ్చిన విషయం తెలిసిందే.
TG: రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ చలన చిత్ర పురస్కారాలు అందజేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అవార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఫిల్మ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రకటన జారీ చేసింది. ఈనెల 20 నుంచి 22 వరకూ దరఖాస్తులను స్వీకరించనున్నట్లు వెల్లడించింది.
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో నటించిన ‘ఎమర్జెన్సీ’ సినిమాకు OTTలో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో ప్రతిపక్ష నేత ఒకరు ఈ చిత్రాన్ని ప్రశంసించినట్లు కంగనా తాజాగా తెలిపారు. ఈ మేరకు ‘నిన్న ఎమర్జెన్సీ చూశాను. మీరు చాలా బాగున్నారు.. లవ్’ అని చేతిరాతతో రాసిన లెటర్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అది తనకు చిరునవ్వు తెప్పించిందని పేర్కొన్నారు.