బిగ్‌బాస్ సీజన్-9 తుది దశకు చేరుకుంది. మరో వారం మాత్రమే మిగిలి ఉంది. ఫైనల్‌కు చేరుకున్న టాప్-5 కంటెస్టెంట్లు ఎవరో తెలిసిపోయారు. తనూజ, డిమోన్ పవన్, కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, సంజన నిలిచారు. ఈ వారం జరిగిన డబుల్ ఎలిమినేషన్లో శనివారం సుమన్‌శెట్టి ఎలిమినేట్ కాగా, ఆదివారం భరణి ఇంటి నుంచి బయటకు వచ్చారు.
‘అఖండ 2’ విజయోత్సవ కార్యక్రమంలో బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఎవరిని చూసుకుని రా బాలకృష్ణకు అంత పొగరు.. అని చాలా మంది అంటూ ఉంటారు. నన్ను చూసుకునే నాకు పదునైన పొగరు’ అని ఆయన పేర్కొన్నారు. ‘మనం బ్యాట్‌మ్యాన్, సూపర్‌మ్యాన్ గురించి మాట్లాడుకుంటాం. ఇది కూడా అలాంటి సినిమానే’ అని తెలిపారు.
‘అఖండ 2’ను విజయవంతం చేసినందుకు ప్రేక్షకులందరికీ నందమూరి బాలకృష్ణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రంలో మనిషే దేవుడు అయితే ఎలా ఉంటుందో చూపించామని ఆయన పేర్కొన్నారు. “ఈ సినిమాలో ప్రతి డైలాగ్ ఆణిముత్యం. మన దేశ మూలాలు, మన ధర్మం, మన గర్వం, మన తేజస్సు కలగలిపిన చిత్రమే ‘అఖండ 2’. ఈ సినిమా చూసి సనాతన హైందవ ధర్మం మీసం మెలేసింది” అని ఆయన వ్యాఖ్యానించారు.
భారతదేశాన్ని ధర్మానికి గ్రంథాలయంగా దర్శకుడు బోయపాటి శ్రీను అభివర్ణించాడు. ‘అఖండ 2’ విజయం దేవుడి సంకల్పం అని ఆయన పేర్కొన్నాడు. ఈ విజయానికి కారణమైన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు. తెలుగు సినీ పరిశ్రమ అంతా ఒకే వేదికపైకి వచ్చి ఐక్యతను ప్రదర్శించాలని పిలుపునిచ్చాడు. అలాగే, త్వరలో ఢిల్లీలో ప్రధాని మోదీ కోసం ‘అఖండ 2’ స్పెషల్ షో వేయనున్నట్లు వెల్లడించాడు.
అఖండ -2 సక్సెస్ మీట్లో సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్లో యూనిటీ లేదన్నారు. టాలీవుడ్‌కి దిష్టి తగిలిందని తెలిపారు. టాలీవుడ్లో ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎవరికైనా దెబ్బ తగిలితే బ్యాండేజ్ వేయండని.. బ్యాండ్ వేయొద్దని హితవు పలికారు.
‘అఖండ 2’ విజయోత్సవ కార్యక్రమంలో నిర్మాత దిల్‌రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ, బోయపాటి చిత్రాల్లో ‘నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్’ ఉంటుందని ఆయన అన్నారు. లాజిక్ చూస్తే మ్యాజిక్ పనిచేయదని ఆయన తెలిపారు. ‘అఖండ 2’ సినిమాకు లాజిక్‌లు అక్కర్లేదని, అది దైవత్వమని చెప్పారు. ఈ సినిమా తరువాత జనరేషన్‌కు ఒక ‘భగవద్గీత, బైబిల్, ఖురాన̵్...
‘బిగ్ బాస్’ 9వ సీజన్ నుంచి కమెడియన్ సుమన్ శెట్టి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే, 14 వారాల పాటు ఉన్నందుకు అతడు భారీ మొత్తంలో పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. అతడు రోజుకు రూ.40 వేల చొప్పున, వారానికి రూ.2 లక్షల 80 వేలు తీసుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన చూస్తే, అతడు 14 వారాల్లో మొత్తం రూ.39 లక్షల 20 వేలు సంపాదించినట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ చిత్రం ఇప్పటివరకు రూ. 446.25 కోట్లు వసూళ్లు రాబట్టి, రూ.500 కోట్ల మైలురాయి వైపు పరుగులు పెడుతోంది. నిన్న ఒక్కరోజే ఈ చిత్రం రూ. 53 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. కాగా, ఇది రణ్వీర్ సింగ్ కెరీర్లోనే రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
టాలీవుడ్ నటుడు అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘డెకాయిట్’. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 18న తెలుగు, హిందీ భాషల్లో టీజర్ విడుదల కానున్నట్లు సమాచారం. ఇక షానీల్ డియో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా, 2026 మార్చి 19న ఇది విడుదల కాబోతుంది.
టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల, సుమ తనయుడు రోషన్ హీరోగా నటించిన ‘మోగ్లీ’ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. తాజాగా ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్‌ను మేకర్స్ ప్రకటించారు. ప్రీమియర్స్‌తో కలిపి ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1.22 కోట్లకుపైగా వసూళ్లు సాధించినట్లు వెల్లడించారు. ఈ మేరకు ‘వైల్డ్ బ్లాక్‌బస్టర్’ అంటూ పోస్టర్ షేర్ చేశారు.
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్, దర్శకుడు విజయ్ కార్తికేయ కాంబోలో ‘మార్క్’ సినిమా రాబోతుంది. ఈ నెల 25న ఇది విడుదల కాబోతుంది. తాజాగా ఈ సినిమాలో యంగ్ బ్యూటీ నవిష్క నాయుడు జాయిన్ అయినట్లు మేకర్స్ వెల్లడించారు. ‘మస్త్ మలైకా’ అనే ఐటెం సాంగ్‌లో సుదీప్తో కలిసి డ్యాన్స్ చేసినట్లు తెలిపారు. ఈ పాట రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు విడుదల కానున్నట్లు ప్రకటించారు.
‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంపై దర్శకుడు అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అభిమానులు చిరంజీవిని ఏ విధంగా చూడాలని కోరుకుంటున్నారో, అదే విధంగా చూపించినట్లు తెలిపాడు. చిరులోని ‘అప్డేటెడ్ వెర్షన్’ కామెడీని ఈ సినిమాలో చూస్తారని పేర్కొన్నాడు. అలాగే, వెంకటేష్, చిరంజీవి వంటి టాప్ హీరోలను ఒకే స్క్రీన్‌పై చూపించే అవకాశం రావడం తన అదృష్టం అని వ్యాఖ్యానించాడు.
నటన ఈ తరాన్ని కూడా వదిలేసిందంటూ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ వేడుకలో ఆయన మాట్లాడుతూ.. తానేమి గొప్ప నటుడిని కాదని చెప్పాడు. తాను ఎమోషనల్ సన్నివేశాల్లో నటిస్తే.. ప్రేక్షకులు నవ్వుతారని తెలిపాడు. అలాగే తాను ఏమైనా చేస్తూ కనిపించవచ్చని చెప్పిన ఆయన.. నటిస్తూ మాత్రం కనిపించలేనని అన్నాడు. అది తన వల్ల కాదని, తనకు ఎలా అనిపిస్తే అలానే చేస్తానని చెప్పాడు.
హైదరాబాద్‌లో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ సినెక్స్ మల్టీప్లెక్స్‌ను కర్మాన్‌ఘాట్‌లోని కొలీసియం మాల్లో 7 స్క్రీన్ లగ్జరీ మల్టీప్లెక్స్‌ను ఏర్పాటు చేయనున్నాడు. ఈ అత్యాధునిక సినిమా హాల్ ద్వారా సినిమా ప్రియులకు మెరుగైన వీక్షణ అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా దీన్ని తీసుకురాబోతున్నాడు.
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న హర్రర్ కామెడీ మూవీ ‘రాజాసాబ్’. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘రెబల్ సాబ్’ రిలీజ్ కాగా.. తాజాగా సెకండ్ సింగిల్ ‘సహన సహన’పై అప్డేట్ వచ్చింది. ఇవాళ సాయంత్రం 6:30 గంటలకు ఈ పాట ప్రోమో విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.