రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ మరోసారి వాయిదా పడింది. బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం AR రెహమాన్ మరికొంత సమయం కోరడమే దీనికి కారణమని టాక్. తొలి భాగానికి మ్యూజిక్ పూర్తయినా, సెకండ్ పార్ట్ ఎడిటింగ్ అయ్యాకే కంపోజింగ్ ఇస్తానని ఆయన చెప్పారట. దీంతో చేసేదేం లేక మేకర్స్ జూన్‌కు పోస్ట్‌పోన్ చేసినట్లు సమాచారం. మే చివరికల్లా పనులన్నీ పూర్తి చేసి జూన్‌లో మూవీని విడుదలచేయనున్నారట.
టాలీవుడ్ నటుడు జేడీ చక్రవర్తి హీరోగా, విలన్‌గా రెండు పవర్‌ఫుల్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘చేతబడి’. క్షుద్రపూజల నేపథ్యంతో యదార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు సూర్యాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. M3 మీడియా, మహా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నట్లు టాక్.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబోలో క్రేజీ ప్రాజెక్టు రాబోతుంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ని ఏప్రిల్ 18 నుంచి మే 4 వరకు చేయనున్నారట. ఇందుకోసం ఓ ఇంటి సెట్‌ని కూడా వేశారట. అంతేకాదు ఈ షెడ్యూల్‌లోనే సల్మాన్‌తో ఒక వింటేజ్ సాంగ్‌ని ప్లాన్ చేశారట. ఇక ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తుండగా.. దిల్ రాజు నిర్మిస్తున్నాడు.
అఖిల్ అక్కినేని నటిస్తున్న ‘లెనిన్’ చిత్రం 2026 జూన్ 26న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం కేవలం 10 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందట. ఇందులో 3 రోజులు టాకీ పార్ట్, మిగతా రోజుల్లో రెండు పాటలను చిత్రీకరించనున్నారట. ఇప్పటికే డబ్బింగ్ పనులు మొదలవ్వగా, మే నెలకల్లా షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) 2026 అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. ‘తండేల్’ చిత్రానికి గాను నాగచైతన్య ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు అనిల్ రావిపూడి ఉత్తమ దర్శకుడిగా, మాస్టర్ రేవంత్ ఉత్తమ హాస్యనటుడిగా నిలిచారు. రానా, శ్రియ, కరణ్ జోహార్ తమ వ్యాఖ్యానంతో వేడుకలో సందడి చేశారు.
‘పాపం ప్రతాప్’ సినిమాలో తిరువీర్, పాయల్ రాధాకృష్ణ జంటగా నటించారు. తనలో సమస్య ఉందని భార్య బుజ్జమ్మ దూరమవడంతో, ఆమెను తిరిగి పొందేందుకు ప్రతాప్ చేసే ప్రయత్నాలే ఈ కథ. వదులుకోలేని ప్రేమకు, కలిసి ఉండనివ్వని సమస్యకు మధ్య జరిగే పోరాటమే ఈ చిత్రం. తిరువీర్ నటన, హాస్యం మెప్పించినా.. సాగదీత కథనం బోర్ కొట్టిస్తుంది. రేటింగ్ 2.75/5.
జూ.ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా వచ్చేందుకు సిద్ధమవుతుంది. తాజాగా ఈ మూవీకి ‘గాడ్ ఆఫ్ వార్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. టైటిల్‌ను బట్టి త్రివిక్రమ్ ఈసారి NTRను ఊరమాస్ అవతారంలో చూపించబోతున్నారని తెలుస్తోంది. తారక్ పుట్టినరోజున ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.
‘సైయారా’తో హిట్ అందుకున్న అహాన్ పాండే, అనీత్ పడ్డా మరోసారి జంటగా కనిపించనున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో మోహిత్ సూరి దర్శకత్వంలో రాబోతున్న మూవీలో వారు నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్ 2026 ఆఖర్లో ప్రారంభం కానుంది. తనదైన ముద్ర ఉన్న సంగీతంతో ప్రేక్షకులను మళ్లీ అలరిస్తానని మోహిత్ ధీమా వ్యక్తం చేశారు. ఈ మూవీని 2027లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన వ్యక్తిగత హక్కుల రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. తన అనుమతి లేకుండా పేరు, ఫొటోలు, వాయిస్ లేదా వీడియోలను వాణిజ్య ప్రయోజనాలకు వాడకూడదని ఆయన కోరాడు. గతంలో అమితాబ్ బచ్చన్, రజినీకాంత్ వంటి వారు కూడా ఇలాంటి హక్కులను పొందారు. బ్రాండ్ విలువ దెబ్బతినకుండా ఉండేందుకు బన్నీ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
కోలీవుడ్ వరుస లీకులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ‘జన నాయగన్’ ఫుటేజ్ లీక్ వల్ల మేకర్స్‌కు భారీ నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’ ఫుటేజ్ కూడా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైందన్న వార్త సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. ఇలాంటి ఘటనలు చిత్ర పరిశ్రమను కలవరపెడుతున్నాయి. కాగా, దీనిపై మేకర్స్ స్పందించాల్సి ఉంది.
తమిళ దర్శకుడు తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వంలో ధనుష్ తన 56వ మూవీని చేయనున్నాడు. తొలుత హీరోయిన్‌గా కన్నడ నటి రుక్మిణి వసంత్ పేరు వినిపించినా, డేట్స్ సర్దుబాటు కాక ఆమె తప్పుకున్నట్లు సమాచారం. దీంతో హీరోయిన్ పాత్ర కోసం ‘ధురంధర్’ చిత్రంతో నేషనల్ వైడ్ బ్లాక్‌బస్టర్ అందుకున్న సారా అర్జున్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్.
‘పుష్ప’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న ‘రాకా’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కనిపించనున్నారనే ప్రచారం సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దీనిపై అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కాగా, గతంలో షారుఖ్‌తో అట్లీ తీసిన ‘జవాన్’ మూవీ భారీ విజయం సాధి...
హీరోయిన్ ఆయుష్మాన్ ఖురానా, యంగ్ సెన్సేషన్ సారా అలీఖాన్ జంటగా నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఉడ్తా తీర్. ప్రముఖ రచయిత ఆకాష్ ఎ కౌశిక్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్ 11, 2026న థియేటర్లలో విడుదల చేయనున్నారు.
1915: ప్రపంచంలో మొదటి మహిళా ప్రధానమంత్రి సిరిమావో బండారునాయకే జననం1966: హీరో విక్రమ్ బర్త్ డే1972: దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ జననం1979: హీరో సిద్ధార్థ్ నారాయణ్ పుట్టిన రోజు1942: నోబెల్ బహుమతి గ్రహీత జీన్ పెర్రిన్ మరణం1975: మాజీ ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్థంతి2004: సినీనటి సౌందర్య మరణం*ప్రపంచ హీమోఫీలియో దినం