తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, ‘2018’ మూవీ దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్ కాంబోలో ఓ మూవీ రాబోతున్నట్లు తెలుస్తోంది. వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై జోసెఫ్ ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీ కథ పరంగా రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. కాగా, రజినీ నటించిన ‘వేట్టయాన్’ మూవీ దసరాకు రిలీజ్ కానుంది.
మలయాళ హిట్ మూవీ ‘అంచక్కల్లకోక్కన్’ తెలుగు వెర్షన్ OTTలోకి రాబోతుంది. ఈ సినిమా ‘చాప్రా మర్డర్ కేస్’ పేరుతో ఆహాలోకి వచ్చేస్తుంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ రేపటి నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సినిమా మలయాళ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
బాలీవుడ్ సినిమా ‘లాపతా లేడీస్’ భారత్ నుంచి 2025 ఆస్కార్‌కు ఎంపికైంది. ఈ మూవీలో నటించిన నటి ప్రతిభ రత్న ఆనందం వ్యక్తం చేశారు. ‘మా కష్టానికి ఫలితం దక్కింది. ఈ మూవీ మన దేశం నుంచి ఆస్కార్‌కు సెలెక్ట్ అవ్వాలని బలంగా కోరుకున్నాం. అది నెరవేరింది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక లక్ష్యాన్ని పెట్టుకుని పని చేస్తూ పోతే రిజల్ట్స్ వాటంతట అవే వస్తాయి. నా విషయంలో అదే జరుగుతోంది’ ...
తిరుమల లడ్డూ కల్తీ వివాదంలో ఫిల్మ్ ఇండస్ట్రీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటుంటే మీరు ఎందుకు సెటైర్లు వేస్తున్నారని ప్రశ్నించారు. స్పందిస్తే స్పందించండి.. లేదంటే మౌనంగా ఉండాలని సూచించారు. అంతేకానీ సనాతన ధర్మం గురించి అపహాస్యంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. నిన్న ఓ ఆడియో ఫంక్షన్‌లో లడ్డూ గురించి చులకనగా మాట్లాడటాన...
తమిళ స్టార్ విజయ్ దళపతి, డైరెక్టర్ వెంకట్ ప్రభు కాంబోలో రూపొందిన సినిమా ‘GOAT'(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం). సెప్టెంబర్ 5న రిలీజై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా OTTలోకి వచ్చేందుకు సిద్ధమైంది. దీని డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ OTT సంస్థ నెట్‌ఫ్లిక్స్ రూ.150 కోట్లకు కొనుగోలు చేసిందట. ఈ మూవీ అక్టోబర్ మొదటి వారంలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
* RTC క్రాస్ రోడ్: సుదర్శన్ 35MM, దేవి 70 MM, సంధ్య 35 MM-70 MM* కూకట్‌పల్లి: విశ్వనాథ్, భ్రమరాంబ- మల్లికార్జున, అర్జున్, PVR ఫోరమ్* ఎర్రగడ్డ: గోకుల్, మూసాపేట్: శ్రీరాములు, అత్తాపూర్: SVC ఈశ్వర్, RC పురం: SVC సంగీత* గచ్చిబౌలి: AMB సినిమాస్, అమీర్‌పేట్: AAA సినిమాస్, NTR గార్డెన్స్: ప్రసాద్ మల్టీప్లెక్స్** ఇలా రాష్ట్రంలోని మొత్తం 29 థియేటర్లకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా నుంచి రేపు ఓ ప్రకటన రాబోతున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ట్వీట్ చేశారు. అయితే ఇటీవల ఈ మూవీ రెండో పాటను సెప్టెంబర్‌లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ పాటపై ఏమైనా అప్డేట్ ఇవ్వబోతున్నారా..? అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
తమిళ హీరో కార్తీ, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఖైదీ’ 2019లో రిలీజై భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి కొనసాగింపుగా ‘ఖైదీ 2’ రాబోతుంది. తాజాగా ఈ సినిమాపై కార్తీ సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం సర్దార్ 2 షూటింగ్ జరుగుతోందని, ఖైదీ 2 వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లొచ్చని తెలిపాడు. అలాగే త్వరలోనే తెలుగు సినిమా చేస్తానని పేర్కొ...
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి ఇప్పటికే పలువురు నటీనటుల ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. తాజాగా ఈ మూవీలో నటిస్తున్న నటి ఐశ్వర్య పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆమె ‘మారెమ్మ’ అనే పాత్రలో కనిపిస్తారని తెలిపారు. ‘అడవిని పీడించే అరాచకం.. మారెమ్మ, కుతంత్రమే ఆమె మంత్రం’ అంటూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
లడ్డూ వివాదంపై హీరో కార్తీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. హైదరబాద్‌లో జరిగిన ‘సత్యం సుందరం’ సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో లడ్డూ అంశం వచ్చింది. ‘లడ్డూ కావాలా నాయనా అంటూ ఓ మీమ్‌ను యాంకర్ చూపించారు. దాని గురించి మాట్లాడుతూ.. లడ్డూ గురించి నేను ఇప్పుడే మాట్లాడను. ఇప్పుడది చాలా సెన్సిటివ్ టాపిక్. ఇలాంటి టైంలో మనకొద్దు’ అని చెప్పారు.
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్.. దర్శకుడు అనుదీప్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో నటి ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక విశ్వక్ ప్రస్తుతం ‘మెకానిక్ రాకీ’ మూవీతో బిజీగా ఉన్నాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబో తెరకెక్కిన ‘దేవర’ మూవీ విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ సునామీలా దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే నార్త్ అమెరికాలో ఈ మూవీ ప్రీమియర్స్ 2 మిలియన్ డాలర్ మార్క్ దాటింది. విడుదలకు మూడు రోజులు ముందే అక్కడి బాక్సాఫీస్‌పై తారక్ దండయాత్ర మొదలైంది. ఫస్ట్ వీకెండ్‌లోనే 5M డాలర్లు రాబట్టే అవకాశం ఉంది. కాగా ఒకరోజు ముంద...
‘దేవర’ మూవీ టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి హీరో ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు. “దేవర విడుదల కోసం కొత్త జీవో జారీ చేసినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మీరు అందిస్తున్న తిరుగులేని మద్దతుక...
తమిళ హీరో కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘సత్యం సుందరం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ సందడి చేశారు. ‘దేవర’ ప్రీ రిలీజ్ వేడుక రద్దయినందుకు బాధపడొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 27న ‘దేవర’ రిలీజ్ కానుంది. ఆ సినిమాతో పాటు ఈ నెల 28న విడుదల కానున్న ‘సత్యం సుందరం’ మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించ...
➢GEMINI: ఎవడైతే నాకేంటి(8:30AM), లాఠీ(3PM)➢ETV: నీకోసం(9AM), ETV PLUS: మొగుడు పెళ్ళాలు(3PM), అల్లుడు దిద్దిన కాపురం(10PM)➢ZEE తెలుగు: జవాన్ (9AM), దృష్టి (3PM)➢Star మా movies: జెండాపై కపిరాజు (7AM), యాక్షన్ (9AM), పుష్పక విమానం(12PM), మారి-2 (3PM), సింగం-3 (6PM)➢ZEE సినిమాలు: సమ్‌థింగ్ సమ్‌థింగ్ (7AM), బలుపు (9AM), వాన (3PM), బ్రూస్ లీ (6PM)➢GEMINI MOVIES:కాంచనమాల కేబుల్ టీవీ (7AM)