శ్రీవిష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ‘విష్ణు విన్యాసం’ ఈనెల 28న విడుదల కానుంది. తాజాగా జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్లో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుందని, అందరినీ అలరిస్తుందని అన్నాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ యువతకు బాగా నచ్చుతుందని, థియేటర్లలో అందరూ హాయిగా నవ్వుకుంటారని ధీమా వ్యక్తం చేశాడు.