టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ తాజాగా ‘హే బల్వంత్’ అనే మూవీలో నటించాడు. ఈ మూవీ ఈరోజు విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రచారంలో భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన కొడుకు నవీన్ ఒకరోజు రాత్రి తనకు మెసేజ్ చేసినట్లు తెలిపాడు. అందులో ‘నా చైల్డ్ హుడ్ ఎంతో బాగుండేది నాన్న. నీ ప్రేమను మిస్ అవుతున్నా’ అని రాసి ఉందన్నాడు. ఆ మెసేజ్ చూడగానే తాను ఎంతో ఏడ్చినట్లు చెప్పుకొచ్చాడు.