NZB: నగరంలోని ఇందిరా ప్రియదర్శిని కాలనీలో జగదాంబ సేవలాల్ మహారాజ్ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన ఆదివారం వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి హాజరైన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ.. దేవాలయాలు సమాజంలో ఐక్యత, శాంతికి కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సంస్కృతిని కాపాడుతాయని తెలిపారు. మేయర్ ఉమారాణి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.