ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను నాలుగు రోజుల పాటు పోలీసుల కస్టడీకి రంగారెడ్డి జిల్లా కోర్టు అనుమతి ఇచ్చింది. నేటి నుంచి 29వ తేదీ వరకు కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న జానీ మాస్టర్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కాగా లేడీ కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం ఆరోపణలు నేపథ్యంలో ఆయన నుంచి పోలీసులు మరింత సమాచారం ...
టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగింది. జల్‌పల్లిలోని తన నివాసంలో పనిమనిషి నాయక్ రూ.10 లక్షలు దొంగిలించి పారిపోయాడు. ఈ మేరకు మోహన్ బాబు రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అతన్ని తిరుపతిలో అరెస్ట్ చేశారు.
పెళ్లి పేరుతో తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బిగ్‌బాస్ OTT కంటెస్టెంట్ ఫిర్యాదుతో ప్రముఖ యూట్యూబర్ హర్షసాయిపై రేప్ కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసుపై హర్షసాయి స్పందిస్తూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. డబ్బు కోసం తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ తెలిపాడు. తన గురించి అభిమానులకు తెలుసు అని.. త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయన్నాడు. ఈ కేసుపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై తన లాయర్ ప...
నేడు ప్రముఖ సింగర్ SP బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి. ఆయన 1946 జూన్ 4న నెల్లూరు జిల్లాలో జన్మించారు. 1966లో వచ్చిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న మూవీతో సింగర్‌గా SPB ప్రస్థానం మొదలైంది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ వంటి భాషల్లో దాదాపు 40వేలకు పైగా పాటలు పాడారు. ETVలో ‘పాడుతా తీయగా’ అనే కార్యక్రమంతో బుల్లితెర ప్రవేశం చేశారు. ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి అవార్డులు వరించాయి....
తన వ్యాఖ్యలకు హీరో కార్తీ క్షమాపణలు చెప్పడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించిన సంగతి తెలిసిందే. దీంతో కార్తీ బ్రదర్ హీరో సూర్య పవన్‌కు ధన్యవాదాలు తెలిపారు. మీ అభినందలకు హృదయపూర్వక కృతజ్ఞతలు సార్ అంటూ రిప్లై ఇచ్చారు. కాగా ‘సత్యం సుందరం’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో యాంకర్ అడిగిన ప్రశ్నకు లడ్డూ ఇప్పుడు సెన్సిటివ్ విషయమని కార్తీ సమాధానం ఇవ్వగా.. లడ్డూ అనేది సెన్సిటివ్ విషయం కాద...
స్టార్ హీరో రామ్ చరణ్, దర్శకుడు శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా రెండో పాటపై మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. Raa Macha Macha అంటూ ఈ పాట సాగుతుందని రివీల్ చేస్తూ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ప్రముఖ యూట్యూబర్ హర్షసాయిపై అత్యాచారం కేసు నమోదైన సంగతి తెలిసిందే. పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుసుకున్న అతడు విదేశాలకు పారిపోయినట్లు తెలుస్తోంది. దుబాయి లేదా అమెరికా వెళ్లినట్లు సమాచారం. కాగా పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని అత్యాచారానికి పాల్పడ్డారని బిగ్‌బాస్ OTT కంటెస్టెంట్ హర్షసాయిపై నార్సింగి పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో పోలీసులు హర్ష సాయిపై 376(2), 376N, 354 సెక్షన్ల కింద రేప...
నిహారిక కొణిదెల సమర్పణలో దర్శకుడు యాదు వంశీ తెరకెక్కించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ ఆగస్టు 9న రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇంకా ఈ మూవీ రేపటితో 50 రోజుల థియేట్రికల్ రన్‌ను పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో రేపు రాత్రి 7 గంటలకు HYDలోని మైత్రీ విమల్ థియేటర్‌లో స్పెషల్ షో వేయనున్నారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేస్తూ.. ఈ షోను మూవీ టీంతో కలిసి చూడవచ్చని మేకర్స్ తెలిపారు.
దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్థంతి సందర్భంగా ఆయనను ఏపీ సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ‘సినీ సంగీత చరిత్రలో ఒక సువర్ణ శకాన్ని తన పరం చేసుకున్న మధుర గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. మైమరపింపచేసే బాలుగారి మధుర గాత్రం పాట రూపంలో చెవులకు వినిపిస్తూనే ఉంది. బాలుగారి వర్ధంతి సందర్భంగా ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి స్మృతికి నివాళి అర్పిస్తున్నాను’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
చాలామంది యువత డ్రగ్స్‌కు బానిసలై వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్‌కు ఆకర్షితులై ఎంతో మంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవితం చాలా విలువైందని, డ్రగ్స్‌కు బానిసలు కావొద్దని కోరుతూ వీడియో రిలీజ్ చేశారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తోన్న తెలంగాణ ప్రభుత్వానికి ...
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం, నయన్ సారిక జంటగా రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘క’. తాజాగా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ మేరకు సెట్స్‌లో మూవీ టీం మొత్తం కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఈ సినిమాకు సుజిత్, సందీప్‌లు దర్శకత్వం వహించారు.
స్టార్ మా: మగధీర (9AM); జీ తెలుగు: వకీల్ సాబ్ (9AM), విశ్వామిత్ర (11PM); ఈటీవీ: బాలుకు ప్రేమతో (9AM); జెమినీ: నువ్వువస్తావని (8:30AM), రణం (3PM); స్టార్‌మా మూవీస్: భజరంగీ (7AM), మల్లన్న (9AM), బిచ్చగాడు-2 (12PM), లవ్‌స్టోరీ (3PM), క్రాక్ (6PM), ఎవడు (9PM); జీ సినిమాలు: గణేశ్ (7AM), రాజరాజ చోర (9AM), భగీరథ (12PM), పెళ్లాం ఊరెళ్తే (3PM), హైపర్ (PM), భయ్యా (9PM).
ప్రముఖ సినీనటి ఊర్మిళ మతోంద్కర్ విడాకులు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. తన భర్త మోసిన్ అక్తార్ మిర్‌తో వైవాహిక బంధానికి స్వస్తి పలకనున్నట్లు సమాచారం. ఈ మేరకు విడాకుల కోసం ముంబై కోర్టులో 4 నెలల క్రితం పిటిషన్ దాఖలు చేసినట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే, ఊర్మిళ నుంచి అధికారిక సమాచారం రాలేదు. ఎనిమిదేళ్ల క్రితం J&Kకు చెందిన వ్యాపారవేత్త, మోడల్ మోసిన్...