హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, ధ్రువ్ విక్రమ్ డేటింగ్లో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఓ అవార్డు వేడుకలో వీరిద్దరూ దిగిన సెల్ఫీని ధ్రువ్ ఇన్స్టాలో షేర్ చేయగా, అనుపమ దానికి ‘లవ్ సింబల్’ జోడించి రీషేర్ చేయడం చర్చకు దారితీసింది. గతంలోనూ రాత్రివేళ ఫోన్ చేయాల్సి వస్తే ధ్రువ్కే చేస్తానని ఆమె అనడం విశేషం. వీరిద్దరూ కలిసి ‘బైసన్’ చిత్రంలో నటించారు.