ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబో మూవీ టైటిల్పై ఉత్కంఠ నెలకొంది. మొదట ఈ మూవీకి ‘డ్రాగన్’ అనే పేరు పెట్టినట్లు వార్తలు వినిపించగా.. తాజాగా ‘బ్రూస్లీ’ అనే టైటిల్ను ఖరారు చేశారట. అయితే, గతంలో రామ్ చరణ్ ‘బ్రూస్లీ’ మూవీ ఆశించిన విజయం సాధించకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కానీ, పాన్ ఇండియా స్థాయిలో ఈ పేరు ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నట్లు టాక్.