‘కల్కి 2’ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు క్రేజీ అప్డేట్ వచ్చింది. ‘కల్కి 2’ షూటింగ్ హైదరాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇప్పటికే సెట్స్‌లో అడుగుపెట్టగా.. ఆయనకు సంబంధించిన కీలక సన్నివేశాలను మేకర్స్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ప్రభాస్, సాయి పల్లవి కూడా ఈ షూటింగ్లో జాయిన్ కానున్నట్లు టాక్.