‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రబృందంతో ముచ్చటించిన ప్రభాస్ ప్రేమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా నటి మానస వారణాసి ‘ప్రేమపై మీ అభిప్రాయం ఏంటి?’ అని అడగ్గా.. ప్రభాస్ సిగ్గుపడుతూ సమాధానమిచ్చాడు. ‘నాకు కూడా ప్రేమలో పడాలని ఉంది. ఆ అద్భుతమైన ఫీలింగ్‌ను అనుభవించాలని ఆతృతగా ఎదురుచూస్తున్నాను’ అని మనసులో మాట బయటపెట్టాడు. ప్రభాస్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరలవుతున్నాయి.