• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

కంగనా ‘ఎమర్జెన్సీ’ విడుదలకు లైన్ క్లియర్..?

కంగనా నటించిన ‘ఎమర్జెన్సీ’ సెన్సార్ అంశంపై ఇవాళ బాంబే హైకోర్టులో విచారణ జరిగింది. ఇటీవల ఈ మూవీ సెన్సార్ విషయంలో సెప్టెంబర్ 25లోగా ఒక నిర్ణయానికి రావాలని కోర్టు సెన్సార్ బోర్డును ఆదేశించింది. తాజాగా దీనిపై కోర్టులో విచారణ జరగ్గా.. మూవీలోని కొన్ని సన్నివేశాలను తొలగిస్తే సెర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ బోర్డు కోర్టుకు తెలిపింది. నిర్మాణ సంస్థ ఇందుకు సమయం కోరింది. ఈనెల 30లోగా నిర్ణయం తీస...

September 26, 2024 / 03:30 PM IST

ఆసుపత్రి బెడ్‌పై బాహుబలి బ్యూటీ నరకయాతన

బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాహుబలి సినిమాలో మనోహరి పాటలో స్టెప్పులేసి అదుర్స్ అనిపించింది ఈ అమ్మడు. ఇప్పుడు ఆసుపత్రి బెడ్‌పై చికిత్స తీసుకుంటూ నరకయాతన అనుభవిస్తుంది. అందుకు సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. కానీ, తనకు ఏమైందన్న విషయం మాత్రం చెప్పలేదు.

September 26, 2024 / 03:25 PM IST

‘గేమ్ ఛేంజర్’ నుంచి లేటెస్ట్ అప్డేట్

రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తోన్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఈ మూవీ నుంచి మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తూ అభిమానుల్లో ఆసక్తి పెంచుతున్నారు. ఇవాళ సాయంత్రం 6:03 గంటలకు సెకండ్ సింగిల్‌పై మరో ట్రీట్ సిద్ధంగా ఉందంటూ థమన్ ట్వీట్ చేశారు. కాగా ఇప్పటికే ఈ మూవీ నుంచి ‘రా మచ్చ మచ్చ’ అంటూ సాగే రెండో పాట ప్రోమోను ఈ నెల 28న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ...

September 26, 2024 / 02:35 PM IST

మరో ఓటీటీకి ఇంటర్ లవ్ స్టోరీ సినిమా

దర్శకుడు శ్రీనాథ్ పులకురం తెరకెక్కించిన ఇంటర్ లవ్ స్టోరీ మూవీ ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143’. ఇప్పటికే ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుండగా.. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చేసింది. ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా నటించిన ఈ మూవీ జూన్ 21న రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

September 26, 2024 / 02:26 PM IST

సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రముఖ నటుడు

అత్యాచారం కేసులో ముందస్తు బెయిల్ కోసం మలయాళ నటుడు సిద్దిఖీ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సిద్దిఖీ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ నటి చేసిన ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదైంది. ఇటీవల ఈ కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కేరళ హైకోర్టు కొట్టిపారేసింది. దీంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో సిద్దిఖీ పిటిషన్ దాఖలు చేశాడు. 

September 26, 2024 / 02:16 PM IST

మహేశ్ బాబు సరసన ఇండోనేషియా హీరోయిన్

మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. SSMB 29 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంపై అక్టోబర్‌లో అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ మూవీలో ఇండోనేషియా హీరోయిన్ చెల్సియా ఎలిజబెత్‌ హీరోయిన్‌గా నటించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

September 26, 2024 / 01:56 PM IST

రిలీజ్‌కు ముందే దేవర రికార్డులు..!

1. ‘అరవింద సమేత’ అనంతరం 6 ఏళ్ళ తర్వాత NTR సోలోగా నటించిన చిత్రం2. డ్యూయల్ రోల్‌లో NTR నటించడం ఇది 4వ సినిమా3. సినిమాలో ఎన్టీఆర్ తన పాత్రకు  4 భాషల్లో డబ్బింగ్ చెప్పారు4. సినిమా విడుదలకు ముందే ‘చుట్టమల్లే’ సాంగ్ 100 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది5. ఈ సినిమాకు ఎన్టీఆర్ రూ.60 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు6. సినిమా బడ్జెట్ రూ.400 కోట్లు. కాగా, ఇప్పటికే రూ. 350 క...

September 26, 2024 / 12:54 PM IST

150 మందితో డ్యాన్స్‌ ప్రదర్శనకు సిద్ధమైన నటి

సినీరంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఐఫా అవార్డుల వేడుక అబుదాబి వేదికగా ఈనెల 27 నుంచి 29 వరకు జరగనుంది. ఇప్పటికే సెలబ్రిటీలు అక్కడికి చేరుకున్నారు. ఇక ప్రతి ఏడాది తన డ్యాన్స్‌తో ఆకట్టుకునే సీనియర్ నటి రేఖ నృత్య ప్రదర్శన ఈ సారి కూడా ప్రత్యేకం కానుంది. 150 మంది డ్యాన్సర్లతో 22 నిమిషాల పాటు రేఖ డ్యాన్స్ చేయనున్నారు. ఈ వేడుకలకు బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్, కరణ్ జోహర్, విక్కీ కౌశల్ యాంకర్...

September 26, 2024 / 12:45 PM IST

జపాన్‌లో ‘హనుమాన్’ రిలీజ్ డేట్ ఫిక్స్

తేజ సజ్జా హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా జపాన్‌లో కూడా సందడి చేసేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 4న జపనీస్ భాషలో ఇది రిలీజ్ కానుంది. ఈ మేరకు ప్రశాంత్ వర్మ సరికొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. అయితే, జపాన్‌లోని కొన్ని థియేటర్లలో ‘హనుమాన్’ తెలుగు వెర్షన్ సైతం జపనీస్ సబ్ టైటిల్స...

September 26, 2024 / 12:17 PM IST

ఎన్టీఆర్‌కు ఆల్‌ ది బెస్ట్‌: సాయి ధరమ్

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన యాక్షన్ డ్రామా దేవర రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతూ మెగా హీరో సాయి ధరమ్ ట్వీట్ చేశాడు. ‘రేపు భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ దేవర రాబోతుంది. ఈ మూవీ చూడటం కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా భారీ విజయం అందుకోవాలని కోరుకుంటున్నా. తారక్‌తో పాటు చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్’ అంటూ రా...

September 26, 2024 / 11:40 AM IST

‘దేవర’ మేకింగ్ వీడియో చూశారా..?

జూ.ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన ‘దేవర’ రేపు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరాలవుతోంది. ఈ వీడియోలో అలలు వచ్చేలా చేయడం, నీళ్లలో కెమెరాను పెట్టి షూట్ చేయడం వంటివి చూపించారు. కాగా, ఈ మూవీ నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్‌లో 2.5 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. ఇక ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహించగా.. జాన్వీ కపూర్, సైఫ...

September 26, 2024 / 11:17 AM IST

స్టార్ హీరో కుమారుడితో అజయ్ భూపతి మూవీ..!

‘మంగళవారం’ మూవీతో దర్శకుడు అజయ్ భూపతి మంచి హింట్ అందుకున్నారు. తాజాగా ఆయన తమిళ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్‌తో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ధృవ్‌కు కథ చెప్పగా.. ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

September 26, 2024 / 10:51 AM IST

OTTలోకి వచ్చేసిన లీగల్ థ్రిల్లర్

వరలక్ష్మి శరత్ కుమార్, రవిశంకర్, శశాంక్, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘RTI’. లీగల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ నేరుగా OTTలోకి వచ్చేసింది. ప్రముఖ OTT సంస్థ ఈటీవీ విన్‌లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.

September 26, 2024 / 10:17 AM IST

పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ హీరో: కృష్ణవంశీ

పవన్ కళ్యాణ్ పై దర్శకుడు కృష్ణవంశీ ప్రశంసలు కురిపించారు. ఎక్స్ వేదికగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. ‘మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై నాకు ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నాయి. అవినీతిమయంగా మారిన రాజకీయాల్లో ఓ వ్యక్తి విలువలు, విశ్వాసాలు నింపేందుకు కష్టపడుతున్నాడు. భగవంతుడు ఆయనకు ఎప్పుడూ అండగా ఉండాలని కోరుకుంటున్నా. పవన్ రియల్ లైఫ్ హీరో’ అని అన్నారు.

September 26, 2024 / 09:46 AM IST

ప్రభాస్, కొరటాల శివ కాంబోలో మూవీ..!

ప్రభాస్, దర్శకుడు కొరటాల శివ కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా దేవర ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై కొరటాల మాట్లాడారు. ఆచార్య ఫ్లాఫ్ తర్వాత ప్రభాస్‌ను తాను కలిశానని, కొన్ని కథల గురించి చర్చించుకున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస మూవీలతో బిజీగా ఉన్నారని, భవిష్యత్తులో ఆయనతో సినిమా ఉండొచ్చని పేర్కొన్నారు.

September 26, 2024 / 09:10 AM IST