రాజమౌళితో సినిమా తీసిన తర్వాత హీరోల నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్‌ను ఎన్టీఆర్ బ్రేక్ చేశారని SS కార్తికేయ ట్వీట్ చేశారు. ’23 ఏళ్ల క్రితం ఎవరితో అయితే ఆ సెంటిమెంట్ మొదలైందో చివరికి ఆ వ్యక్తితోనే అది బ్రేక్ అయింది. ఎన్టీఆర్‌ను దగ్గరి నుంచి చూస్తూ పెరిగాము. ఇప్పుడు ఆయన అద్భుతాలకు సాక్షులు కావడం ఎంతో ప్రత్యేకం. దేవర మాస్ అదిరిపోయింది. ఇది అభిమానులకు తారక్ ఇచ్చిన స్పెషల్ ...
AP: తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వును వినియోగించారన్న వార్తలపై తాజాగా హీరోయిన్ ఖుష్బూ స్పందించారు. కల్తీకి పాల్పడ్డవారు ఎవరైనా సరే మూల్యం చెల్లించుకోవాల్సిందేనని అన్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నీ చూస్తున్నాడంటూ ఖుష్బూ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టారు.
జూ.ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కాంబోలో తెరకెక్కిన ‘దేవర’ సినిమా ఇవాళ విడుదలైంది. ఈ మూవీని తాజాగా పాన్ ఇండియా దర్శకుడు రాజమౌళి కుటుంబసభ్యులతో కలిసి ఈ చిత్రాన్ని వీక్షించారు. బాలానగర్‌లోని మైత్రి విమల్ థియేటర్ లో సినీ అభిమానులతో కలిసి ఆయన చిత్రాన్ని చూశారు.
యంగ్ టైగర్ NTR, జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘దేవర’ ఎన్నో అంచనాల మధ్య ఇవాళ విడుదలైంది. తాజాగా ఈ మూవీలోని నటీనటుల రెమ్యూనరేషన్ గురించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. NTR దాదాపు రూ.60 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. జాన్వీ కపూర్ రూ.5 కోట్లు, సైఫ్ అలీఖాన్ రూ.10 కోట్లు, ప్రకాష్ రాజ్ రూ.1.5 కోట్లు, శ్రీకాంత్ రూ.50 లక్షలు, మురళీ శర్మ రూ.40 లక్షలు, కొరటాల శివ రూ.30 క...
జూ.ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన ‘దేవర’ సినిమా ఇవాళ విడుదలైంది. USలో నిన్న ఈ మూవీ ప్రీమియర్ షోలో వేశారు. అక్కడ ఇప్పటికే ఈ మూవీ ప్రీ సేల్స్‌లో రికార్డు క్రియేట్ చేయగా.. తాజాగా ప్రీమియర్‌లో మంచి వసూళ్లు రాబట్టింది. 2.7 మిలియన్ డాల్లర్ల క్రాస్ మార్క్‌ను దాటేసింది. ఈ మేరకు మేకర్స్ స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించారు.
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ మూవీ సెట్స్ నుంచి ఐకానిక్ పిక్చర్‌ను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మూవీ సెట్స్‌లో దర్శక దిగ్గజం రాజమౌళి సందడి చేశారు. ఈ సందర్భంగా సుకుమార్, ఆయన టీం రాజమౌళితో కలిసి దిగిన ఫొటోను నెట్టింట షేర్ చేయగా.. సూపర్ పిక్ ...
OTT ప్రియులకు గుడ్ న్యూస్. తాజాగా OTTలోకి సరికొత్త సినిమాలు వచ్చేశాయి. నారా రోహిత్ నటించిన పొలిటికల్ డ్రామా ‘ప్రతినిధి 2’ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకా శోభిత ధూళిపాళ నటించిన ‘లవ్, సితార’ జీ5లో రిలీజ్ అయింది. అరుళ్ నిధి, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన ‘డిమోంటి కాలనీ 2’ జీ5లో అందుబాటులోకి వచ్చింది.
తెలుగు రాష్ట్రాల ఆడియన్స్‌పై బాలీవుడ్ సీనియర్ నటుడు సైఫ్ అలీఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు ఆడియన్స్ అక్కడి హీరోలను ఎంతగానో ఆదరిస్తారని.. ప్రేక్షకులు వారి అభిమాన హీరోలను దేవుళ్లలా చూస్తారని కామెంట్స్ చేశారు. కాగా, ఇవాళ విడుదలైన ‘దేవర’ సినిమాతో సైఫ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.
NTR నటించిన దేవర విడుదలైంది. భయం అంటే ఏంటో తెలియని వారికి దేవర భయాన్ని ఎలా పరిచయం చేశాడనేది మూవీ కథ. డ్యూయల్ రోల్‌లో NTR చాలా బాగా నటించారు. ఇతర నటీనటులు కూడా వారి పాత్రలకు న్యాయం చేశారు. క్లైమాక్స్‌లో ఇచ్చిన ట్విస్ట్ పార్ట్ 2పై అంచనాలను పెంచింది. ఫస్టాఫ్‌లో ఉన్నంత హైప్‌ను సెకాండఫ్‌లో కొరటాల కొనసాగించలేకపోయారు. కొన్ని సీన్స్ స్లోగా సాగడం, లవ్ స్టోరీ పెద్దగా ఆకట్టుకోకపోవ...
తమిళ హీరో కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘సత్యం సుందరం’. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు U సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ మేరకు మేకర్స్ స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దర్శకుడు సి.ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా రేపు విడుదలవుతుంది.
AP:ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కిన దేవర సినిమా ఇవాళ విడుదలైంది. ఈ సినిమా బెనిఫిట్ షోలో ఎన్టీఆర్ అభిమానులు పలుచోట్ల రచ్చ రచ్చ చేశారు. టికెట్లు లేకుండానే కడపలోని రాజా థియేటర్లోకి ఒక్కసారిగా దూసుకొచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పిరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసులు అభిమానులను చెదరగొట్టారు. మరోవైపు ప్రకాశంలోని యర్రగొండపాలెం లక్ష్మీ వెంకటేశ్వర థియేటర్లో కూడా ఫ్యాన్స్ కొట్టుకోవడంతో ఒకరికి గాయాల...
జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జతగా తెరకెక్కిన దేవర సినిమా ఇవాళ విడుదలైంది. దీంతో నందమూరి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఇప్పటికే పలుచోట్ల బెనిఫిట్ షోలు ప్రదర్శించగా ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ స్టోరీ భారీ ట్విస్ట్‌తో ముగియగా సెకండ్ ఆఫ్‌లో అనుకున్న రేంజ్‌లో లేకున్నా ప్రీ క్లైమాక్స్ సీన్ అదరగొట్టిందంటున్నారు. మొత్తానికి ఈ సినిమాకు 3.35 రేటింగ్ ఇచ్చేయోచ్చని నెటిజ...
ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా టికెట్లు అధిక ధరకు విక్రయిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని స్వర్ణ థియేటర్‌లో రెవెన్యూ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అదనపు షోలు, టికెట్ ధరల పెంపుపై థియేటర్ అనుమతులను పరిశీలించారు. సెకండ్ షోకు సంబంధించి ముందుగానే అధిక రేట్లకు అమ్మకాలు జరిపినట్లు అధికారులు గుర్తించారు.
ఇవాళ అర్ధరాత్రి నుంచి OTTలోకి కొత్త సినిమాలు రాబోతున్నాయి. అరుళ్ నిధి, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన ‘డిమోంటి కాలనీ 2’, శోభిత ధూళిపాళ నటించిన ‘లవ్, సితార’ జీ5లో స్ట్రీమింగ్ కానున్నాయి. నారా రోహిత్ నటించిన ‘ప్రతినిధి 2’ ఆహాలో అందుబాటులోకి రాబోతుంది. ఇక ఇప్పటికే నాని ‘సరిపోదా శనివారం’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా.. శ్రద్...
తమిళ హీరో కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన ‘సత్యం సుందరం’ మూవీ ఈ నెల 28న విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ మెగా హీరో సాయి ధరమ్ ట్వీట్ చేశాడు. తాజాగా దీనిపై స్పందించిన కార్తీ.. స్వీట్ రిప్లై ఇచ్చాడు. ‘బ్రదర్.. ప్రేమ, ఆప్యాయతతో మీరు ఎల్లప్పుడూ మంచి మనసు చాటుకుంటారు. మీ విషెష్‌కు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశాడ...