మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా విడుదలపై సందిగ్ధత నెలకొంది. 2026 సమ్మర్ రిలీజ్ అని చిరు స్వయంగా చెప్పినా, భారీ VFX పనుల వల్ల జాప్యం జరుగుతోంది. మరోవైపు ఆలస్యంగా మొదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఇప్పటికే విడుదలై రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో ఇండస్ట్రీ హిట్ కొట్టింది. దీంతో పెండింగ్లో ఉన్న ‘విశ్వంభర’ ఓటీటీ డీల్, విడుదల తేదీపై మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.