టాలీవుడ్ నటుడు సుహాస్ హీరోగా దర్శకుడు గోపి అచ్చర తెరకెక్కించిన ‘హే బల్వంత్’ మూవీ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు ఈ మూవీ రూ.2.14 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా, ఎలాగైనా తండ్రి బిజినెస్‌ను తాను టేకప్ చేయాలనే కొడుకు కథతో ఈ మూవీ తెరకెక్కింది.