హీరోయిన్ సాయి పల్లవి లేడీ ఓరియెంటెడ్ కథతో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనున్నాడట. ఈ మేరకు సాయి పల్లవిని దృష్టిలో పెట్టుకుని ఓ అద్భుతమైన కథను ఆయన రెడీ చేసినట్లు తెలుస్తోంది. సాయి పల్లవికి కథను వినిపించగా.. ఆమె ఓకే చెప్పినట్లు టాక్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు సమాచారం.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ మూవీ నుంచి రిలీజైన ఫస్ట్ సింగిల్ ‘దేఖ్లేంగే సాలా’కు యూట్యూబ్‌లో సాలిడ్ రెస్పాన్స్ వస్తోంది. కేవలం 15 గంటల్లోనే ఈ పాట 20 మిలియన్లకుపైగా వ్యూస్‌ని సాధించింది. దీంతో టాలీవుడ్ నుంచి బిగ్గెస్ట్ రెస్పాన్స్ అందుకున్న తొలి పాటగా ఇది నిలిచిందని సినీ వర్గాలు తెలిపాయి.
టాలీవుడ్ నటుడు ప్రియదర్శి, ఆనంది జంటగా నటించిన ‘ప్రేమంటే’ మూవీ OTTలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ OTT సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమ కనకాల, వెన్నెల కిషోర్, హైపర్ ఆది తదితరులు కీలక పాత్రలు పోషించారు.
రెబల్ స్టార్ ప్రభాస్‌తో దర్శకుడు మారుతి తెరకెక్కిస్తోన్న ‘రాజాసాబ్’ మూవీ 2026 జనవరి 9న విడుదలవుతుంది. ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ఈ నెల 18న రిలీజ్ కానున్నట్లు సమాచారం. అంతేకాదు US, APలో మొత్తం రెండు ప్రీ-రిలీజ్ ఈవెంట్లను నిర్వహించనున్నారట. మొదట USలో, ఆ తర్వాత విజయవాడ లేదా వైజాగ్‌లో ఈ నెల 27న ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు టాక్.
ప్రముఖ హాలీవుడ్ నటుడు పీటర్ గ్రీన్(60) అనుమానాస్పద స్థితిలో మరణించాడు. న్యూయార్క్‌లోని గ్రీన్ అపార్ట్మెంట్లో విగతజీవిగా కనిపించారని ఆయన మేనేజర్ ధృవీకరించాడు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే అపార్ట్మెంట్లో ఎలాంటి సస్పెక్ట్ యాక్టివిటీస్ లేవని పోలీసులు తెలిపారు. కాగా, గ్రీన్.. ‘పల్ప్ ఫిక్షన్’, ‘ది మాస్క్’ వంటి సినిమాల్లో నటించాడు.
పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమా ఆలస్యానికి పవన్ కారణం కాదని హరీష్ స్పష్టం చేశాడు. మొదట లవ్‌స్టోరీ అనుకుని, దాని మీద వర్క్ చేశాం. ఆ తర్వాత రీమేక్ చేయాలనుకున్నాం, అదీ సాధ్యపడలేదు. అందరినీ అలరించేలా రాసుకున్నదే ఈ కథ’ అని వెల్లడించాడు.
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘అఖండ 2’ మూవీ మంచి హిట్ అందుకుంది. త్వరలోనే ‘అఖండ 1, 2’ సినిమాలు ఒక సిరీస్‌గా రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సిరీస్ ఐదు భాగాలుగా వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
దర్శకుడు సెల్వరాఘవన్, ఆయన రెండో భార్య గీతాంజలి విడిపోతున్నారా? అనే అంశంపై నెట్టింట చర్చ నడుస్తోంది. గీతాంజలి తన ఇన్‌స్టాలో నుంచి భర్త ఫొటోలన్నీ డిలీట్ చేయడమే దీనికి కారణం. గతంలో సోనియాతో విడిపోయిన సెల్వ.. ఇప్పుడు ఈమెతో కూడా బ్రేకప్ చెప్పుకుంటున్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ మధ్య సెలబ్రిటీలు విడాకులకు ముందు ఇలాగే ఫొటోలు డిలీట్ చేస్తున్న విషయం తెలిసిందే.
తమిళ బిగ్ బాస్ షోలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. కంటెస్టెంట్లు పార్వతి, కమ్రుద్దీన్ డార్క్ రూమ్‌లో ముద్దులతో రెచ్చిపోయారంటూ ప్రచారం జరుగుతోంది. ఆ సన్నివేశాలు కనిపించకపోయినా .. వారి మైక్‌లో కిస్ చేసుకుంటున్నట్లు శబ్దాలు క్లారిటీగా వినిపించాయని నెటిజన్లు చెబుతున్నారు. వారు గంటసేపు డార్క్ రూమ్‌లో ఉండగా.. అనంతరం బిగ్ బాస్ వారిని బయటకు పిలిచినట్లు పేర్కొంటున్నారు.
‘New Guy in the Town’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో కొత్త హీరో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గతంలో అప్డేట్ ఇచ్చాడు. అయితే ఈ సినిమా కోసం దర్శకుడు వెంకీ కుడుముల నిర్మాతగా మారాడు. ఆయన లాంచ్ చేసిన ‘What Next Entertainments’ బ్యానర్లో ఈ మూవీ రాబోతుంది. రేపు ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్ రాబోతుంది.
టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా ప్రేమలో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. వచ్చే ఏడాదిలో తరుణ్, ఈషా వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
నటసింహం బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘అఖండ 2’ మూవీ మంచి హిట్ అందుకుంది. అయితే ఈ సినిమా ఆఫర్‌ను మంచు మనోజ్ వదులుకున్నట్లు తాజాగా వార్తలొస్తున్నాయి. ఈ సినిమాలో ఆది పినిశెట్టి నటించిన పాత్ర కోసం మొదట మంచు మనోజ్‌ను సంప్రదించారట. బోయపాటి ఆయనకు కథను వినిపించగా.. అప్పటికే మనోజ్ పలు ప్రాజెక్టులకు కమిట్ అవ్వడంతో నో చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది.
‘ఉప్పెన’తో డెబ్యూ ఇచ్చిన నటి కృతి శెట్టికి బ్యాడ్‌లక్ వెంటాడుతోంది. ఆమె నటించిన మూవీలు వాయిదా పడుతున్నాయి. హీరో కార్తీతో కృతి నటించిన ‘అన్నగారు వస్తారు’ మూవీ ఈ నెల 12న రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా పడింది. అలాగే ఈ నెల 18న విడుదల కావాల్సిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ మూవీ కూడా వాయిదా పడనున్నట్లు సమాచారం. దీంతో ఈ ప్రభావం కృతి కెరీర్‌పై పడనున్నట్లు టాక్ వి...
వరుస హిట్లతో దూసుకెళ్తోన్న నందమూరి బాలకృష్ణ.. తాజాగా మరో ఘనత సాధించారు. ఒకే ఏడాదిలో రెండు సినిమాలతో వచ్చి హిట్ కొట్టిన హీరోగా ఆయన నిలిచారు. ఈ ఏడాది జనవరిలో ‘డాకు మహారాజ్’, డిసెంబర్లో ‘అఖండ 2’ చిత్రాలతో వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. దీంతో నందమూరి అభిమానులు.. ‘ప్రారంభం బాలయ్యదే.. ముగింపు బాలయ్యదే’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
రొమ్ము క్యాన్సర్‌తో టాలీవుడ్ నటి వాహిని పోరాడుతుంది. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అయితే వాహిని ట్రీట్మెంట్కు దాదాపు రూ.35 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్స్ తెలిపినట్లు సమాచారం. దీనిపై నటి కరాటే కళ్యాణి SMలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఆమె చికిత్స కోసం ఆర్థికసాయం చేయాలని కోరింది.