• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »స్పెషల్ స్టోరీస్

ఆత్మీయమైన అజాతశత్రువు

ఆయన సినిమాల్లోకి వచ్చినప్పుడు కొమ్ములు తిరిగిన మహానటులు సినిమా సామ్రాజ్యాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలుతున్నారు. మరొకడికి చోటే లేనంత ఉక్కిరిబిక్కిరిలో పరిశ్రమ ఉయ్యాలలూగుతోంది. కానీ ఆయనకి స్థానం లభించింది. అందమైన రూపం, మృదువైన మాట, ఉంగరాల జుత్తు, ఎత్తైన విగ్రహం, బంగారు ఛాయ, పరిపుష్టమైన గొంతు…కలగలిసిన ఆ అబ్బాయి ఎక్కడో ఓ ఫ్లాష్‌లా తోచాడు కొందరికి. అప్పుడే కొత్తవాళ్ళతో సినిమా చేయాలనుకున్న ఓ సంస్...

June 24, 2025 / 12:10 PM IST

లేడీ అమితాబ్‌ అందరి కన్నా ఎందుకు గ్రేట్‌..?

అందరూ చేసే పనో, అందరూ చెయ్యగలిగే పనో చేస్తే ఎవ్వరూ ఎవర్నీ గొప్ప అనరు. అనుకోరు. ఎవ్వరూ చెయ్యలేని పని చెయ్యగలిగినప్పుడో, చేసినప్పుడో మాత్రమే ఆ వ్యక్తుల్ని ప్రపంచం గొప్ప అని గుర్తిస్తుంది. ఇది ఏ రంగానికైనా సర్వసహజమైన వాస్తవం. అతి చిన్నవయసులో, తమిళంలో హీరోయిన్‌గా ఎంటరై, అక్కడనుంచి ఎన్నో దశాబ్దాలుగా ఎన్నో పాత్రలు, ఎన్నెన్నో జైత్రయాత్రలు చేసిన విజయశాంతి ఎందుకు ఎలా గ్రేట్‌ అయ్యారు? ఎర్రగా బుర్రగా ఉన్న...

June 24, 2025 / 12:30 PM IST

26 ఏళ్ళ నిరంతర జాతర

కొందరు సంగీత దర్శకులకు పేరు పెట్టలేం. వాళ్ళేంచేసినా చిత్తశుద్ధితో, కళాత్మకమైన దృష్టితో చేసి, వాళ్ళ స్వరరచన ద్వారా పాటలకి ప్రాణం పోసి, తద్వారా సినిమాల విజయానికి నేను సైతం అని శ్రీశ్రీ అన్నట్టుగా వాళ్ళదైన బలాన్ని, చేయూతనీ అందిస్తారు. అది ఒకనాడు ఘంటసాలగారి దగ్గర్నుంచీ తీసుకుంటే ఆకోవలో కొందరినే గుర్తు చేసుకోగలం. అటువంటి స్వరబ్రహ్మల సంతకాలు కాలప్రవాహం మీద ఎప్పటికీ చెరిగిపోకుండా మెరుపులు మెరుస్తూనే ఉ...

June 23, 2025 / 11:04 AM IST

కాబోయే భారతరత్న తండ్రిగా..

కొందరు తండ్రుల వల్ల పిల్లలకి పేరు, గుర్తింపు వస్తాయి. కొందరి విషయలో ఇది పూర్తిగా విభిన్నం. కొందరి పిల్లల వల్ల తల్లతండ్రులకు చాటింపు లభిస్తుంది. సచిన్‌ పెద్ద బ్యాట్స్‌ మేన్ అయ్యేవరకూ ఆయన తండ్రి ఎవరో ప్రపంచానికి తెలిసే అవకాశం రాలేదు.చివరిగా ఆయన ఓ భారతరత్న తండ్రి చరిత్రలో. అలాగే మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి అనే చారిత్రక కథానాయకుడిగా చిరంతనమైన కీర్తిప్రతిష్టలకు కేంద్రబిందువుగాఎదిగిన తర్వాత గానీ ఆయ...

June 16, 2025 / 06:47 PM IST

అప్పుడు రామానాయుడు, అశ్వనీదత్‌. ఇప్పుడు విశ్వప్రసాద్‌

ఇప్పటికీ గుర్తు. చెవిలో పువ్వు సినిమా నిర్మాణం టైంలో సుప్రసిద్ధ దర్శకుడు ఇవివి సత్యనారాయణకి అడ్వాన్‌ ఇవ్వని నిర్మాతే లేడు మద్రాసులో. చెవిలో పువ్వు సినిమాకి వచ్చిన ప్రీ రిలీజ్‌ బజ్‌ ఎవ్వరినీ ఇంటి దగ్గర నిద్రపోనివ్వలేదు. ఆడ్వాన్సులు వర్షం కురిసింది ఇవివిపైన. సినిమా రిలీజైంది. సూపర్‌ ఫ్లాప్‌. వెంటనే మళ్ళీ ఇవివికి ఫోన్లే ఫోన్లు. అమ్మాయి పెళ్ళి ఫిక్స్‌ అయిందని ఒకరు, భార్యకి ఆపరేషన్‌ ఉందని మరొకరు, బ్...

June 16, 2025 / 05:57 PM IST

విశ్వంభర, రాజాసాబ్‌…..ఇప్పుడు వార్‌2….

వార్‌ 2 ట్రైలర్‌ తారక్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదలై ఓ రకంగా చెప్పాలంటే జూనియర్‌ స్టేటస్‌ని బాగానే పెంచింది. ఆయన అభిమానులు పండగ చేసుకున్నారు. ఎక్కడో తమ హీరోకి త్రిబుల్‌ ఆర్‌ సినిమాకి సంబంధించి, సరైన సముచితమైన గౌరవం దక్కలేదని పిచ్చెక్కిపోయిన మందికి వార్‌2 ట్రైలర్‌ కొంచెం కాలర్‌ ఎగరేసుకునే అవకాశాన్నిచ్చింది.

May 23, 2025 / 06:27 PM IST

లైలా దారిలో భైరవం

దర్శకుడు కనకమేడల వ్యవహారం చూస్తుంటే నిజమేననిపిస్తోంది. శుభమా అని భైరవం సినిమా ఈ నెల 30వ తేదీన విడుదల కాబోతూంటే, ఎప్పుడో అజ్ఞానంతో, అవివేకంతోనో, ఒళ్లు కొవ్వెక్కో చేసిన కోతిపని ఇప్పుడు కనకమేడల మెడకి పాముల చుట్టుకుని బుసలు కొట్టి, సెగలు కక్కుతోంది. ముందుకెళ్తే నుయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యి అన్నట్టుగా కనకమేడల విజయ్‌కి చుక్కలు చూపిస్తోంది

May 23, 2025 / 05:31 PM IST

ఓ నిత్యస్వాప్నికుడి స్వప్నవేదిక

జీవితమంతా కొత్తవారిని ప్రోత్సహిస్తూ, వారి ద్వారా సూపర్‌డూపర్‌ హిట్లు నిర్మిస్తూ అతి తక్కువ కాలంలోనే అగ్రస్థానానికి చేరుకున్న ఘనత గడిచిన మూడు దశాబ్దాలలో దిల్‌రాజుకి తప్పితే మరొక్కరికి దక్కనే దక్కదు.

May 23, 2025 / 04:57 PM IST

అడుక్కుతింటున్న సింగిల్‌ స్క్రీన్‌ ధియేటర్లు

అసలే ఓటిటిల దెబ్బకి సింగిల్‌ స్క్రీన్లు దాదాపుగా అడుక్కుతింటున్నాయి. మెగస్టార్‌ తర్వాత ధియేటర్లకి జనాలని పరిగెత్తించే మొనగాడే లేడు. ఓ ముగ్గురో నలుగురో ఉన్నా వాళ్ళు మూడేళ్ళకో సినిమాతో ప్రత్యక్షమవుతున్నారు. ఈ లోగా సింగిల్‌ స్క్రీన్లు ఈగలు తోలుకోవడమే. ఏ యంగ్‌ హీరో సినిమాని చూడ్డానికి జనం పెద్ద ఆసక్తి చూపించడం లేదు.

May 22, 2025 / 01:05 PM IST

కీరవాణి మీద సోషల్‌ మీడియా ఆగ్రహం

పవన్‌ కళ్యాణ్‌ సినిమా గురించి పవన్‌ అభిమానులు ముఖం వాచిపోయున్నారు. ఇటువంటి పరిస్థితులలో కీరవాణి అందించిన బాణీలు డోకొస్తున్నాయని పోష్టులు పెడుతున్నారు. విశ్వంభర చిత్రానికి సంబంధించి శ్రీరామ పాట విని అందరూ తలలు పట్టుకున్నారు.

May 20, 2025 / 05:02 PM IST

ఏంటీ జయసుధ లుంగీలో పోటో గొడవ..?

ఈ మధ్య సోషల్‌ మీడియాలో లుంగీ కట్టుకుని సహజనటి జయసుథ నిలబడ్డ ఓ ఫోటో తెగ వైరల్‌ అయింది. ఆమె సన్నిహితులు, మిత్రబృందం కూడా శక్తివంచన లేకుండా ఆ స్టిల్‌ని ఆమెకు ఆ ఫోటోని పంపించి, పంపించి ఊపిరాడనివ్వకుండా చేశారు. ఆ లుంగీ చాలా పాప్యులర్‌ బ్రాండ్‌గా డెబ్భై దశకాల నుంచి ఇటీవలి వరకూ కూడా కొనసాగుతూ వచ్చిన శంఖు మార్కు లుంగీ.

May 20, 2025 / 04:52 PM IST

ఇందులో వెంకటేష్‌ ఉన్నట్టా..? లేనట్టా..?

మెగా అనిల్‌ కాంబినేషన్‌ గురించి ఇంకో ముఖ్యమైన విషయం మీద మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. అదేంటంటే...ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్‌ కూడా ప్రధానమైన పాత్రను పోషిస్తాడనే వార్త మొదటనుంచి వైరల్‌ అవుతూనే ఉంది.

May 20, 2025 / 04:46 PM IST

హరిహర వీరమల్లు కథాకమామీషు..

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా వస్తున్న హరిహరవీరమల్లు పూర్తిగా వార్తల్లో ఎక్కడా లేకపోవడంతో మెగాఅభిమానులు పూర్తిగా నిరాశలో కూరుకుపోయారు. ఒక్కసారి రిలీజ్‌ డేట్‌ ఎనౌన్స్ కాగానే సముద్ర కెరటాల్లా అభిమానులు ఆకాశమంత ఎత్తుకు ఎగిరి, కేరింతలు కొడుతున్నారు. దీని వెనుక కాంబినేషన్‌ సెన్సేషన్‌ కూడా దాగి ఉండడం కూడా ప్రధానమైన కారణంగా భావించాలి.

May 20, 2025 / 04:39 PM IST

నాగార్జున కొత్త సినిమా టైటిల్‌..?

తొంభైతొమ్మిది సినిమాలు చేసిన ఒక సీనియర్‌ హీరోకి సరికొత్తగా కథని ఎంపిక చేయడమే కష్టమైన విషయమైతే, ప్రస్తుతం ఉన్న పోటీలో, ధియేటర్లకి ఆడియన్సే రావడానికి సుముఖత కనబరచని స్థితిలో ఆ కథని తెరకెక్కించి బాక్సాఫీసుని మెప్పించడం దాదాపుగా దుర్లభమైపోతోంది.

May 20, 2025 / 04:31 PM IST

నాగార్జునకి మాఫియా సూటవుతుందా..?

ఎన్నో సూపర్‌డూపర్‌ హిట్లు కొట్టి, నటసమ్రాట్‌ అక్కినేని నాగేశ్వరావు నటవారసత్వాన్ని అత్యంత విజయవంతంగా నిలబట్టిన ఘనత యువసమ్రాట్‌ నాగార్జునకి ముమ్మాటికి దక్కుతుంది. కెరీర్‌ బిగినింగ్‌లో కొన్ని వైఫల్యాలను చవిచూసినా సరే. నిలకడగా కెరీర్‌ని విజయపథంలోకి నడిపించుకున్ని పత్యేకతకి నాగార్జున ఎప్పటికీ చెరగని సంతకం. మణిరత్నం అంటే ఏంటో కూడా తెలుగు చిత్రపరిశ్రమకి పూర్తిగా తెలియని రోజుల్లోనే, ఏటికి ఎదురీదినట్టుగ...

May 14, 2025 / 02:15 PM IST