• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

ఐదు భారీ సినిమాలను తిరస్కరించిన సాయిపల్లవి

చిత్రసీమలో కొందరు ఆఫర్ల కోసం ఎదురుచూస్తుంటే హీరోయిన్ సాయిపల్లవి మాత్రం వచ్చిన భారీ ఆఫర్‌లను తిరస్కరించింది. విజయ్ నటించిన లియో, వారసుడు, అజిత్ నటించిన వలిమై, చిరంజీవి నటించిన భోళాశంకర్, కార్తీ నటించిన చెలియా సినిమాల్లో హీరోయిన్‌గా వచ్చిన అవకాశాలను రకరకాల కారణాలతో వదిలేసుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి వెల్లడించింది.

January 19, 2025 / 08:20 AM IST

మంచు మనోజ్, విష్ణు మధ్య మాటల యుద్ధం

మంచు మనోజ్, విష్ణు మధ్య నెట్టింట మాటల యుద్ధం జరుగుతోంది. ‘కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. నాన్న, ఇంట్లోని మహిళలు, ఉద్యోగులు మిగిలిన వాళ్లను పక్కన పెట్టి మనమే చర్చించుకుందాం. ఏం అంటావు’ అని మనోజ్ పోస్టు పెట్టాడు. మరోవైపు మనోజ్‌తో వివాదంపై ఓ ఇంటర్వ్యూలో విష్ణుకు ప్రశ్న ఎదురైంది. ‘మనం చేసే చర్యలే మన వైఖరికి అద్దం పడతాయి. జనరేటర్‌లో పంచదార పోస్తే పేలదు’ అని తెలిపాడు.

January 18, 2025 / 11:23 AM IST

‘పట్టుదల’తో రాబోతున్న అజిత్

తమిళ హీరో అజిత్ ప్రధాన పాత్రలో మాగిజ్ తిరుమేని తెరకెక్కించిన మూవీ ‘విడాముయార్చి’. తాజాగా ఈ సినిమాను తెలుగులో ‘పట్టుదల’ అనే టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇవాళ సాయంత్రం 6:40 గంటలకు తమిళంతో పాటు తెలుగులో ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు.

January 16, 2025 / 02:22 PM IST

BREAKING: బాలీవుడ్ స్టార్ నటుడిపై దాడి

ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ముంబైలోని సైఫ్ నివాసంలో కత్తితో దుండగుడు దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్ అలీఖాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆయన్ని ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు.

January 16, 2025 / 08:20 AM IST

ఆస్కార్‌ వేడుక రద్దు.. క్లారిటీ!

ఈ ఏడాది ఆస్కార్ వేడుక రద్దు కానుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ రూమర్స్‌పై ఆస్కార్ అకాడమీ స్పందించింది. ‘ఆస్కార్ అవార్డుల వేడుకను రద్దు చేయాలనే ఆలోచన అకాడమీకి లేదు. వేడుకల్లో ఎలాంటి మార్పు ఉండదు. మార్పులుంటే స్వయంగా మేమే వెల్లడిస్తాం’ అని తెలిపింది. కాగా.. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో కార్చిచ్చు కారణంగా ఆస్కార్ నామినేషన్ల ప్రక్రియ ఆలస్యమైంది.

January 15, 2025 / 11:20 AM IST

‘అనగనగా ఒకరాజు’ OTT పార్ట్‌నర్ ఫిక్స్

టాలీవుడ్ హీరో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ‘అనగనగా ఒకరాజు’. తాజాగా ఈ సినిమా OTT పార్ట్‌నర్ ఫిక్స్ అయింది. నెట్‌ఫ్లిక్స్ దీని డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. కళ్యాణ్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

January 14, 2025 / 02:17 PM IST

ఆ స్టార్ హీరోని రిజెక్ట్ చేసిన సాయిపల్లవి

లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి ‘అమరన్’ మూవీ హిట్‌తో ఫుల్ జోష్‌లో ఉంది. అయితే, ఈ బ్యూటీ ఓ స్టార్ హీరో మూవీకి నో చెప్పినట్లు తెలుస్తోంది. కోలీవుడ్ హీరో విక్రమ్.. దర్శకుడు మడోన్ అశ్విన్ దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయి పల్లవిని చిత్ర బృందం ఎంపిక చేసిందట. కానీ, ఆ డేట్స్‌కి కాల్షీట్ లేకపోవడంతో ఆ అవకాశాన్ని వదులుకున్నట్లు సమాచారం.

January 13, 2025 / 11:29 AM IST

ఆన్‌లైన్‌లో ‘గేమ్ ఛేంజర్’ HD ప్రింట్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘గేమ్ ఛేంజర్’ థియేటర్లలో ఇవాళ విడుదలైంది. తాజాగా ఈ సినిమా ఆన్‌లైన్‌లో HD ప్రింట్ అందుబాటులోకి వచ్చింది. దీంతో అభిమానులు అందరూ షాక్ అవుతున్నారు. కాగా, దీనిపై మేకర్స్ ఇంకా స్పదించలేదు. ఇక ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించాడు.

January 10, 2025 / 02:24 PM IST

వాళ్ల ముందు మా యాక్షన్ సరిపోవట్లేదు: బ్రహ్మాజీ

బౌన్సర్లను ఉద్దేశించి సినీ నటుడు బ్రహ్మాజీ ఓ పోస్ట్ చేశాడు. ‘ఎక్కడ చూసిన బౌన్సర్ల యాక్షన్ ఓవర్ అవుతుంది. వాళ్ల యాక్షన్ ముందు మా యాక్షన్ సరిపోవడం లేదు. అవుట్ డోర్స్ అయితే పర్లేదు కానీ సెట్స్‌లో కూడానా?’ అంటూ పోస్ట్‌లో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

January 6, 2025 / 01:15 AM IST

‘OG’ సినిమాపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

‘OG’ సినిమాపై AP డిప్యూటీ సీఎం, హీరో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘OG 1980-90ల మధ్య జరిగే కథ. ఎక్కడికెళ్లినా అభిమానులు OG.. OG అని అరుస్తుంటే.. అవి నాకు బెదిరింపుల్లాగా అనిపిస్తున్నాయి. నేను ఒప్పుకున్న అన్ని మూవీలకు డేట్స్ ఇచ్చాను. వాళ్లే సరిగ్గా వినియోగించుకోలేదు. హరిహర వీరమల్లు మరో 8 రోజుల షూటింగ్ ఉంది. అన్ని సినిమాలను పూర్తి చేస్తాను’ అని తెలిపారు.

December 30, 2024 / 04:22 PM IST

‘కన్నప్ప’ నుంచి హీరోయిన్ లుక్ రిలీజ్

మంచు విష్ణు టైటిల్ రోల్‌లో నటిస్తోన్న సినిమా ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో నటి ప్రీతి ముకుందన్ కథానాయికగా నటిస్తోంది. తాజాగా మేకర్స్ ఆమె లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో ప్రీతి.. రాకుమారి నెమలి పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. ఇక మంచు మోహన్ బాబు నిర్మిస్తోన్న ఈ సినిమా 2025 ఏప్రిల్ 25న విడుదల కానుంది.

December 30, 2024 / 04:01 PM IST

23ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. తాజాగా ఈ సినిమా HYDలోని ఐకానిక్ సంధ్య థియేటర్‌లో పవన్ కళ్యాణ్ ఖుషి నెలకొల్పిన 23ఏళ్ల రికార్డును బ్రేక్ చేసింది. 2001లో వచ్చిన ఖుషి రూ.1.56 కోట్లు సాధించగా.. ‘పుష్ప 2’ రూ.1.59 కోట్లు రాబట్టింది. దీంతో ఫ్యాన్స్ బన్నీకి సెల్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.    

December 30, 2024 / 03:49 PM IST

హిందీలో ‘పుష్ప 2’ లేటెస్ట్ కలెక్షన్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప 2’ మూవీ భారీ విజయం అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. హిందీలో ఈ సినిమా విడుదలైన 25 రోజుల్లో రూ.770.25 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. ఈ మేరకు హిందీ బాక్సాఫీస్ నెంబర్ 1 సినిమా ఇదేనని మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.1700 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.

December 30, 2024 / 03:21 PM IST

అల్లు అర్జున్ కేసు విచారణ వాయిదా

సినీ హీరో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. జనవరి 3కు విచారణ వాయిదా వేస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు. కాగా, సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో బన్నీ బెయిల్ పిటిషన్ వేశారు. దానిపై చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు.

December 30, 2024 / 12:29 PM IST

‘గేమ్ ఛేంజర్’.. పాటల కోసం అన్ని కోట్లా?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తోన్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. తాజాగా ఈ మూవీ పాటల బడ్జెట్‌కు సంబంధించిన న్యూస్ ఒకటి బయటకొచ్చింది. ఈ మూవీలో మొత్తం ఐదు పాటలు ఉన్నాయి. అయితే ఈ సాంగ్స్ షూట్ కోసం రూ.75 కోట్లు ఖర్చు పెట్టారట. కాగా, ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన నాలుగు పాటలు మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. ఇక ఈ సినిమా 2025 జనవరి 10న విడుదలవుతుంది.

December 30, 2024 / 12:11 PM IST