నిహారిక కొణిదెల నిర్మాణంలో సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్న ‘రాకాస’ మూవీ ఏప్రిల్ 3న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కుల డీల్ క్లోజ్ అయింది. తెలుగు హక్కులను శ్రీ లక్ష్మీనరసింహ మూవీ మేకర్స్ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటించారు. ఇక దర్శకురాలు మానస వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నయన్ సారిక కథానాయికగా నటిస్తుంది.