SKLM: జీడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి జీడి బోర్డు ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పలాసలో ఇవాళ జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 80 కేజీల జీడి బస్తాకు రూ.16 వేల మద్దతు ధర ఇవ్వాలని కోరారు. లేదంటే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.