పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గ్లింప్స్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. ‘మ్యాజిక్ జరిగింది.. ముహూర్తం కుదిరింది.. ట్రైలర్ అదిరింది’ అంటూ ట్వీట్ చేశారు. ఉగాది పర్వదినాన విడుదలైన ఈ వీడియో పవర్‌ఫుల్‌గా ఉందని, ఈ సినిమాతో అన్నీ శుభాలే జరుగుతాయని ఆయన ఆకాంక్షించారు. హరీష్ శంకర్ మేకింగ్, పవన్ స్వాగ్ అదిరిపోయాయని మెచ్చుకున్నారు.