SKLM: ఎచ్చెర్లలోని ఎన్టీఆర్ నైపుణ్యాభివృద్ధి మహిళా సాధికారిత కేంద్రంలో మహిళలకు వృత్తి విద్యా శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ మేనేజర్ రబీకా శామ్యూల్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. 2 నెలల శిక్షణ అసిస్టెంట్ బ్యూటీ థెరపిస్ట్, 45 రోజులు శిక్షణ హ్యాండ్ ఎంబ్రాయిడరీ, 90 రోజులు శిక్షణ డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఈనెల 20 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.