GDWL: ప్రతి ఒక్కరూ బాధ్యతగా చెత్తను ట్రాక్టరుకే అందించి పల్లె ప్రగతిలో భాగస్వాములు కావాలని సద్దలోనిపల్లి గ్రామ సర్పంచ్ బెల్లం నర్సింలు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదివారం మల్దకల్ మండలం సద్దలోనిపల్లిలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా సాగాయి. గ్రామంలోని చెత్తను శుభ్రం చేసి యువకులకు అవగాహన కల్పించారు.